కేటీఆర్ అహంకారం తగ్గలేదు? పీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు

కేటీఆర్ అహంకారం తగ్గలేదు? పీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు

Summarize with AI

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ఈ ప్రసంగం రాజకీయంగా కొత్త దుమారాన్ని రేపింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ ఈ ప్రసంగంపై సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది.

కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని మహేష్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా కేసీఆర్ హాజరయ్యే విషయాన్ని స్వాగతిస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వానికి అవసరమైన సూచనలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

కేటీఆర్ చేసిన ఆరోపణలు కూడా తీవ్ర చర్చకు దారి తీసాయి. గవర్నర్ ప్రసంగం అర్ధ‌ సత్యాలు, అసత్యాలతో నిండిపోయిందని, ఇది కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందని విమర్శించారు. గవర్నర్ చేత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment