జూలై 30న ప్రేక్షకుల ముందుకు ‘శ్రీనివాస మంగాపురం’

జూలై 30న ప్రేక్షకుల ముందుకు ‘శ్రీనివాస మంగాపురం’

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు (Mahesh Babu) అన్న రమేష్ బాబు (Ramesh Babu) కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు (Mohan Babu) కీలక పాత్రలో నటిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ (P. Kiran) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ (Ashwini Dutt) సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ప్రచార వీడియోలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.

తాజాగా చిత్రబృందం ఈ సినిమాను జూలై 30న (July 30) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించగా, అజయ్ భూపతి తనదైన శైలిలో ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. జయకృష్ణ ఘట్టమనేని తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటుండగా, రాషా తడానీ కూడా తన అందం, నటనతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరోగా జయకృష్ణపై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment