ఏపీలో వాక్ స్వ‌తంత్రం కూడా లేదా..? కారుమూరు అరెస్టుపై వైసీపీ ఆగ్రహం

ఏపీలో ఆ స్వ‌తంత్రం కూడా లేదా..? కారుమూరు అరెస్టుపై వైసీపీ ఆగ్రహం

కూట‌మి ప్రభుత్వాన్ని (Alliance Government) ఆధారాల‌తో స‌హా ప్రశ్నిస్తున్నవారిపై రెడ్‌బుక్ (Red Book) రాజ్యాంగం (Constitution) అమలు చేస్తున్నారంటూ వైసీపీ(YSRCP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి (Karumuru Venkata Reddy)ని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన ఘటనపై వైసీపీ నేతలు సీరియ‌స్‌గా స్పందిస్తున్నారు. రాజ‌కీయప‌ర‌మైన ఆరోప‌ణ‌లను కూడా స్వీక‌రించ‌లేక‌పోవ‌డం అంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం (Chandrababu Government) ఎంత‌టి అభ‌ద్ర‌తాభావంతో ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని మండిప‌డుతున్నారు.

ఇవాళ‌ తెల్లవారుజామున ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ (Hyderabad)లోని కూకట్‌పల్లి (Kukatpally) నివాసంలో తాడిప‌త్రి పోలీసులు కారుమూరు వెంక‌ట‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో అధికారులు క‌నీసం నోటీసులు కూడా చూపించ‌లేద‌ని, కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేయడం, అలాగే వారి ఫోన్లను లాక్కోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. “ఏ నోటీసులు ఇవ్వకుండా అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. సీఐ మరణంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశార‌ని చెప్పారు” అని ఆమె తెలిపింది. సీఐ స‌తీష్‌కుమార్ (CI Satish Kumar) మ‌ర‌ణంపై వెంక‌ట‌రెడ్డి లేవ‌నెత్తిన ఆరోప‌ణ‌ల‌పై తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ప్ర‌సాద్ నాయుడు అనే రైతు ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనతో వైసీపీ నాయకత్వం తీవ్రంగా మండిపడుతోంది. ఒక రాజ‌కీయ పార్టీ అధికార ప్ర‌తినిధి ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేసే స్వేచ్ఛ‌, స్వ‌తంత్ర్యం కూడా ఏపీలో లేదా..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం మీద విమ‌ర్శ‌లు చేయడం నేరం కాదని, కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలను, ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. సీఐ స‌తీష్ కుమార్‌ది హ‌త్యా, ఆత్మ‌హ‌త్యా అని తెలియ‌కుండానే తెలుగుదేశం పార్టీ నేత‌లు చేసిన త‌ప్పుడు ప్ర‌చారంపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో చెప్పాల‌ని పోలీసుల‌ను వైసీపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నారు. వెంక‌ట‌రెడ్డి అరెస్ట్‌ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసింది.

మ‌రి ఏ ఆధారాలు లేకుండా టీడీపీ అనుకూల మీడియాగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌త్రిక‌లు, ఛానెళ్లు మ‌ద్యం, న‌కిలీ మ‌ద్యం త‌యారీ కేసుల్లో, తిరుమ‌ల ల‌డ్డూ, వైఎస్ వివేకానంద‌రెడ్డి, ముంబై న‌టి జ‌త్వానీ కేసుల్లో వైఎస్ జ‌గ‌న్‌పై ఎలా దుష్ప్ర‌చారం చేయ‌గ‌లిగారు.. అని ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment