SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

Summarize with AI

SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరుకుంది. జీపీఆర్ (GPR) టెక్నాలజీ, క్యాడవర్ డాగ్స్ సహాయంతో మృతదేహాల కోసం విస్తృతంగా తవ్వకాలు చేప‌డుతున్నారు. డీ వాటరింగ్, TBM (టన్నెల్ బోరింగ్ మెషిన్) కటింగ్ పనులు వేగంగా కొన‌సాగుతున్నాయి.

మరోవైపు, ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వ‌ద్ద రెస్క్యూ ఆప‌రేష‌న్‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఆయన ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సంఘటన స్థలంలో పరిస్థితులను సమీక్షించారు. మళ్లీ టన్నెల్ వద్దకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ పురోగతిని అధికారుల‌ను అడిగి తెలుసుకోనున్నారు.

పరిహారం ప్రకటనపై ఆసక్తి
SLBC టన్నెల్ ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. అప్పటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఈ రోజు మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment