సంజూ శామ్సన్ సెంచరీతో సీఎస్‌కే దుమ్మురేపింది

సంజూ శామ్సన్ సెంచరీతో సీఎస్‌కే దుమ్మురేపింది

వాంఖడే స్టేడియంలో (Wankhede Stadium) జరిగిన మ్యాచ్‌లో CSK దుమ్మురేపింది. (Mumbai Indians)పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తమ శక్తిని చాటుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే(CSK) 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా, సంజూ శామ్సన్ (Sanju Samson) అద్భుత శతకం (54 బంతుల్లో 101*)తో జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ పూర్తిగా తడబడిపోయి 19 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. వాంఖడేలో ముంబైకి ఇది అత్యంత చేదు పరాజయంగా నిలిచింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంజూ శామ్సన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, వాంఖడేలో ఇంత భారీగా సీఎస్‌కే అభిమానులను చూడటం ఇదే మొదటిసారి అని చెప్పాడు. ప్రస్తుతం తన ఆటను సింపుల్‌గా ఉంచుతూ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే విజయ రహస్యమని వెల్లడించాడు. వికెట్లు పడుతున్న సమయంలో జట్టు బాధ్యతను గుర్తించి చివరి వరకు క్రీజులో నిలబడటమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. వరుస ఓటముల తర్వాత కూడా జట్టులోని యువ ఆటగాళ్లు చూపిన ఆత్మవిశ్వాసం తనకు ఆనందం కలిగించిందని, ఇదే జోరును కొనసాగిస్తూ ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతామని సంజూ స్పష్టం చేశాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment