రిలీజ్‌కు ముందే రచ్చ.. ‘రామాయణ’, ‘టాక్సిక్’తో హైప్‌కు కొత్త నిర్వచనం!

రిలీజ్‌కు ముందే రచ్చ.. ‘రామాయణ’, ‘టాక్సిక్’తో హైప్‌కు కొత్త నిర్వచనం!

Summarize with AI

సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రమోషన్స్‌లో కీలక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ ప్రమోషన్స్ ఈ విషయంలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాయి. ట్రైలర్‌కు ముందే ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో భారీ వరల్డ్ ఈవెంట్ తరహాలో బజ్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఆ తర్వాత విడుదలైన ట్రైలర్‌లోని విజువల్స్, భారీ స్టార్ కాస్ట్‌తో అంచనాలను మరింత పెంచారు. మరోవైపు రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా గ్రాండ్ ప్రమోషన్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బెంగళూరులో జరిగిన భారీ ట్రైలర్ లాంచ్, యష్ మాస్ ఎంట్రీతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.

‘రామాయణ’, ‘టాక్సిక్’ ప్రమోషన్స్‌ను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా భారీ ఈవెంట్లు, స్టార్ ఎంట్రీలు, గూస్‌బంప్స్ ఇచ్చే విజువల్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం.. ఆ తర్వాత ట్రైలర్‌తో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లడం ఇప్పుడు మేకర్స్ ఫార్ములాగా మారింది. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్, గ్రాండ్ ఈవెంట్లు, భారీ హైప్ ఎంత వచ్చినా చివరకు థియేటర్‌లో ప్రేక్షకుడిని మెప్పించేది కంటెంట్ మాత్రమే. అందుకే ఈ రెండు సినిమాల టీమ్స్ ముందున్న అసలైన సవాలు హైప్ క్రియేట్ చేయడం కాదు.. ఆ హైప్‌కు ఏమాత్రం తగ్గకుండా థియేటర్లలో ప్రేక్షకులకు అనుభూతిని అందించడమే. మరి ఈ భారీ అంచనాలను ‘రామాయణ’, ‘టాక్సిక్’ ఎంతవరకు అందుకుంటాయో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment