ఏపీలో(Andhra Pradesh) స్థానిక సంస్థల(Local Bodies) సందడి కొనసాగుతూనే ఉంది. ఇక, రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) పోలింగ్‌కు (Polling) సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం మినహా మిగిలిన 27 జిల్లాల్లోని 52 డివిజన్లు, 246 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,975 గ్రామ పంచాయతీల్లో(Gram Panchayats) 1,095 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం (Unanimous) కాగా, మిగిలిన 3,880 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రెండో విడతలో మొత్తం 4,975 సర్పంచ్ స్థానాలు(Sarpanch Seats), 49,318 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వీటిలో 1,170 సర్పంచ్ స్థానాలు, 19,655 వార్డు సభ్యుల స్థానాలు (Ward Member Seats) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,803 సర్పంచ్ స్థానాలకు, 29,603 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరోవైపు రెండు పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 60 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.
బరిలో 10,295 మంది సర్పంచ్ అభ్యర్థులు
రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం 10,295 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డు సభ్యుల స్థానాలకు 63,395 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణలు, ఏకగ్రీవాల ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఏర్పాట్లలో భాగంగా 37,019 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 83,52,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 41,05,292 మంది పురుషులు, 42,46,608 మంది మహిళలు ఉన్నారు. మరో 438 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 5,65,848 మంది ఓటర్లు ఉండగా, 342 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.








