ఢిల్లీలో డీలిమిటేషన్‌ హీట్‌.. మరో పది సీట్ల దూరంలో ఎన్డీయే!

ఢిల్లీలో డీలిమిటేషన్‌ హీట్‌.. మరో పది సీట్ల దూరంలో ఎన్డీయే!

Summarize with AI

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లు (Delimitation Bill) నేపథ్యంలో ఢిల్లీలో(Delhi) రాజకీయ వాతావరణం వేడెక్కింది. బిల్లు ఆమోదానికి (Bill Approval) అవసరమైన ప్రత్యేక మెజార్టీ సాధించేందుకు ఎన్డీయే (NDA) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డీఎంకే(DMK), శరద్‌ పవార్‌ (Sharad Pawar) నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) మద్దతుతో బిల్లుకు అనుకూలంగా ఉన్న ఎంపీల సంఖ్య పెరగనుంది. మరోవైపు బీఆర్‌ఎస్‌(BRS) సహా మరిన్ని తటస్థ పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

డీఎంకేకు చెందిన 22 మంది, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీల మద్దతుతో బిల్లుకు అనుకూలంగా ఉన్న ఎంపీల సంఖ్య 320 నుంచి 350కి చేరే అవకాశం ఉంది. లోక్‌సభలో(Lok Sabha) 540 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొంటే రాజ్యాంగ సవరణ బిల్లు (Constitutional Amendment Bill) ఆమోదానికి 360 ఓట్లు అవసరమవుతాయి. ఈ లెక్కన ఎన్డీయేకు మరో పది మంది ఎంపీల మద్దతు అవసరం. రానున్న రెండు రోజుల్లో మరిన్ని తటస్థ పార్టీల మద్దతును కూడగట్టేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోంది.

డీలిమిటేషన్‌ బిల్లు విషయంలో కాంగ్రెస్‌ వైఖరితో ఇండియా కూటమిలోని(INDIA Alliance) కొన్ని పార్టీలు విభేదిస్తున్నాయి. డీఎంకే, ఎన్సీపీ వైఖరితో విపక్ష కూటమిలో భిన్నాభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. డీఎంకే, ఎన్సీపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల వైఖరిపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తోంది.

డీలిమిటేషన్‌ బిల్లుతో ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు కాంగ్రెస్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరోవైపు ఎన్డీయే అవసరమైన ప్రత్యేక మెజార్టీ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో ఢిల్లీలో చోటుచేసుకోనున్న రాజకీయ పరిణామాలు కీలకంగా మారనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment