రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. బ్రాన్సన్ రీడ్ కన్నుమూత!

రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. బ్రాన్సన్ రీడ్ కన్నుమూత!

Summarize with AI

ప్రొఫెషనల్ రెజ్లింగ్ (Professional Wrestling) ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. WWE ప్రముఖ సూపర్‌స్టార్ బ్రాన్సన్ రీడ్ (Bronson Reed) (అసలు పేరు జెర్మైన్ హేలీ (Jermaine Haley)) శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. తీవ్రమైన అనారోగ్య సమస్యల (మెడికల్ కాంప్లికేషన్స్) కారణంగా ఆయన మరణించినట్లు WWE అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అయితే మరణానికి గల కచ్చితమైన కారణాలను సంస్థ బయటపెట్టలేదు.

క్రౌన్ జ్యువెల్ ఈవెంట్ తర్వాత..
దాదాపు మూడు వారాల క్రితం సౌదీ అరేబియాలో(Saudi Arabia) జరిగిన ‘క్రౌన్ జ్యువెల్’ (Crown Jewel) ఈవెంట్‌లో బ్రాన్సన్ రీడ్ చివరిసారిగా రింగ్‌లో కనిపించారు. ఆ మ్యాచ్‌లో ఒబా ఫెమీ (Oba Femi)తో జరిగిన ఘర్షణలో రీడ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కోలుకుంటున్నట్లు భావిస్తున్న తరుణంలోనే ఆయన మరణవార్త వెలువడటం రెజ్లింగ్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

బ్రాన్సన్ రీడ్ (Bronson Reed) మృతిపై WWE తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “జెర్మైన్ (Jermaine) WWEలో ఒక గొప్ప శక్తివంతమైన వ్యక్తి. అంతకంటే ముఖ్యంగా ఆయన ఎంతో మంచి మనిషి, కుటుంబానికి అంకితమైన వ్యక్తి, అందరికీ ఇష్టమైన సహోద్యోగి” అంటూ WWE నివాళులర్పించింది.

కెరీర్ ప్రస్థానం & కుటుంబం
1988 ఆగస్టు 25న ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో(Adelaide) జెర్మైన్ హేలీ (Jermaine Haley) జన్మించారు. WWEలోకి రాకముందు అంతర్జాతీయ సర్క్యూట్లలో ‘జోనా రాక్’ (Jonah Rock) పేరుతో ఆయన సుపరిచితులు. 2019లో WWEలో చేరి NXT నార్త్ అమెరికన్ ఛాంపియన్‌గా నిలిచారు.

2022లో WWE మెయిన్ రోస్టర్‌లోకి తిరిగి అడుగుపెట్టిన ఆయన, 2024లో ప్రతిష్టాత్మక ‘ఆండ్రీ ది జెయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్’ (André the Giant Memorial Battle Royal)ట్రోఫీని గెలుచుకున్నారు. బ్రాన్సన్ రీడ్‌కు భార్య పేజ్ (గర్భవతి), ఒక కుమార్తె ఉన్నారు. చిన్న వయసులోనే ఆయన మరణించడంతో తోటి రెజ్లర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కన్నీటి నివాళులర్పిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment