రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణ: పార్ట్ 1’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. సినిమా విడుదలకు ఇంకా 11 రోజుల సమయం ఉండగానే ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్ ద్వారా సుమారు రూ.20.50 కోట్ల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. భారత్‌తో పాటు విదేశాల్లోనూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు దాదాపు 2.25 లక్షల టికెట్లు అమ్ముడవగా, నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర మార్కెట్లలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
నవంబర్ 4న ప్రీమియర్ షోలు, నవంబర్ 5న తొలి రోజు ప్రదర్శనలకు సంబంధించిన బుకింగ్స్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్ $2 మిలియన్ల మార్కును దాటినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రివ్యూ షోలకు మంచి స్పందన లభిస్తోంది. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ థియేటర్లు, షోల సంఖ్య పెరిగితే అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రీమియర్ షోలు, తొలి రోజు బుకింగ్స్ కలిపిన మొత్తాన్ని కేవలం మొదటి రోజు వసూళ్లుగా పరిగణించకూడదు.








