టీడీపీ (TDP) అనుకూల మీడియా సంస్థలో పదవుల వ్యవహారం రచ్చకెక్కింది. సొంత అల్లుడికి ఏబీఎన్ (ABN) రాధాకృష్ణ (Vemuri Radhakrishna) కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా డైరెక్టర్ (Director) పదవి నుంచి తప్పించడం సంచలనంగా మారింది. ఇతరుల వ్యక్తిగత జీవితాలు, ముఖ్యంగా వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) కుటుంబ వ్యవహారాలపై నిత్యం వార్తలు రాసే వేమూరి రాధాకృష్ణ ఇంటి గొడవ బజారుకెక్కి నెట్టింట వైరల్‌గా మారింది.
రోజూ టీవీల్లోనూ, పత్రికల్లోనూ నీతులు చెప్పే రాధాకృష్ణకు తన సొంత అల్లుడికే గౌరవ మర్యాదలు ఇవ్వడం తెలియదనే విషయం ఆ సంస్థలో అక్టోబర్ 9న చోటుచేసుకున్న పదవుల మార్పులతో మరోసారి బహిర్గతమైంది.
ఆమోదా బ్రాడ్‌కాస్టింగ్ (Amoda Broadcasting) సంస్థలో కొత్త హోదాలను కేటాయిస్తూ విడుదల చేసిన జాబితా ప్రకారం వేమూరి రాధాకృష్ణ తన హోదాను మేనేజింగ్ డైరెక్టర్ (MD) పోస్టు నుంచి చైర్మన్‌గా మార్చుకున్నారు. తన కుమారుడు ఆదిత్య వేమూరికి మేనేజింగ్ డైరెక్టర్ (MD) బాధ్యతలు అప్పగించగా, కుమార్తె అనూష వేమూరికి (Anoosha Vemuri) జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (JMD) పదవిని కట్టబెట్టారు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇన్నాళ్లూ ఏబీఎన్ సంస్థలో కీలకమైన డైరెక్టర్ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చిన సొంత అల్లుడు కోగంటి భాను ప్రకాష్‌ను ఉన్నపళంగా ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో శ్రుతి కీర్తి (Shruthi Keerthi) అనే మరో వ్యక్తికి డైరెక్టర్‌గా అవకాశం కల్పించారు.
తనపై జరిగిన ఈ అన్యాయం, అవమానంపై వేమూరి రాధాకృష్ణ అల్లుడు కోగంటి భాను ప్రకాష్ సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. “కొందరు మీడియా ప్రతినిధులు తమ సొంత ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా, ఇతర కుటుంబాల్లోకి తొంగిచూస్తూ బిజీగా గడుపుతుంటారు” రాధాకృష్ణను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ప్రత్యక్షంగా ఏబీఎన్ రాధాకృష్ణ నైజానికే అద్దం పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిత్యం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) కుటుంబంపై, ఇతర వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాలపై లేనిపోని కల్పిత కథనాలను ప్రచురిస్తూ పబ్బం గడుపుకునే రాధాకృష్ణకు.. తన ఇంటి అల్లుడిని ఎలా అవమానించాడో కనీసం చూసుకునే జ్ఞానం లేకపోవడం హాస్యాస్పదం అని వైసీపీ శ్రేణులు సెటైర్లు పేల్చుతున్నారు.









