పెద్ది ట్రైలర్.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం!

పెద్ది ట్రైలర్.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం!

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’(Peddi)పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ లాంటి యావ‌రేజి సినిమా తర్వాత రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న సినిమా కావడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మొదటి నుంచే విడుదల చేస్తున్న పోస్టర్లు, గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తున్నాయి.

పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు(Release) సిద్ధమైంది. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మేకర్స్.. ఈరోజు ముంబైలో (Mumbai) ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను (Trailer) మీడియా ప్రతినిధులు, ట్రేడ్ వర్గాలకు ముందుగా ప్రదర్శించారు.

అనంతరం ట్రైలర్‌ను యూట్యూబ్‌లో అధికారికంగా విడుదల చేశారు. ట్రైలర్‌లో రామ్ చరణ్ మాస్ లుక్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘పెద్ది’ ట్రైలర్ వైరల్ అవుతోంది. అభిమానులు ట్రైలర్ చూసి సినిమాపై భారీ హిట్ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు జూన్ 4 రిలీజ్‌పైనే నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment