పాస్టర్ చేతిలో యువతి నరకయాతన.. ఆలస్యంగా వెలుగులోకి ఘ‌ట‌న‌

పాస్టర్ చేతిలో యువతి నరకయాతన.. ఆలస్యంగా వెలుగులోకి ఘ‌ట‌న‌

Summarize with AI

పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాలో ఓ పాస్టర్ తన చర్చికి హాజరయ్యే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, అక్టోబర్ 2017 నుంచి ఆమె చర్చికి హాజరవుతుందని, అప్పుడే పాస్టర్ బాజిందర్ సింగ్ (43) తన మొబైల్ నెంబర్ తీసుకుని అస‌భ్య‌క‌ర‌ మెసేజ్‌లు పంపడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ఆయన వ్యవహారశైలిని గమనించినా భయంతో తల్లిదండ్రులకు చెప్పలేక ఏళ్లుగా మౌనంగా భరించాల్సి వచ్చింది. చివరికి సహనం కోల్పోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు పాస్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment