పాకిస్తాన్‌లో హై అలర్ట్ భద్రత

పాకిస్తాన్‌లో హై అలర్ట్ భద్రత

Summarize with AI

అమెరికా–ఇరాన్ (America-Iran) మధ్య కీలకమైన శాంతి చర్చలకు వేదికగా పాకిస్తాన్ రాజధాని (Pakistan Capital) ఇస్లామాబాద్ (Islamabad) మళ్లీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. సోమవారం నుంచి ఈ చర్చలు ప్రారంభమవుతాయని పాకిస్తాన్ వర్గాలు చెబుతున్నప్పటికీ, అధికారికంగా తేదీపై స్పష్టత ఇంకా రాలేదు. ఇదిలా ఉండగా, మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) తమ ప్రతినిధులు సోమవారం ఇస్లామాబాద్ చేరుకుంటారని పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్‌‌జాదే (Saeed Khatibzadeh) మాత్రం ఇంకా తుది నిర్ణయం వెలువడలేదని తెలిపారు. ఈ అనిశ్చితి మధ్య కూడా పాకిస్తాన్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలు పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి. ఇస్లామాబాద్ లోని సెరీనా హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా, నగరం అంతా ఆర్మీ చీఫ్ అసీం మునీర్ (Asim Munir) చిత్రాలతో నిండిపోయింది. కీలక ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయడంతో నగరం నిర్మానుష్యంగా మారింది. ఫైజాబాద్ బస్ టెర్మినల్ మూసివేత, ప్రజా రవాణాపై నిషేధం, మార్కెట్లు – విద్యాసంస్థలు మూసివేత వంటి చర్యలు ‘అనధికారిక లాక్‌డౌన్’ పరిస్థితిని సృష్టించాయి. 6000కిపైగా పోలీసులతో పాటు రేంజర్లు, సైన్యం మోహరించడం ద్వారా పాకిస్తాన్ ఈ చర్చలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది. చర్చలు నిజంగా జరుగుతాయా అనే సందేహాల మధ్య రాజధాని మొత్తం నిశ్శబ్ధంలో మునిగిపోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment