బాధితురాలు కాదు.. బ్లాక్‌మెయిల‌రా..? జత్వానీ కేసు చార్జ్‌షీట్‌లో కీల‌క అంశాలు

బాధితురాలు కాదు.. బ్లాక్‌మెయిల‌రా..? జత్వానీ కేసు చార్జ్‌షీట్‌లో కీల‌క అంశాలు

Summarize with AI

ఏపీ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నటి కాదంబరి జత్వానీ (Kadambari Jethwani) కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో గత రెండేళ్లుగా ఒక వర్గం మీడియా చేసిన ప్రచారానికి భిన్నంగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ (Alliance Government) ఆధీనంలోని ఏపీ సీఐడీ(AP CID) హైకోర్టుకు (High Court) సమర్పించిన తాజా నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ(YSRCP) నేత విద్యాసాగర్ చేసిన ఆరోపణలే నిజమని తేలుస్తూ సీఐడీ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడం రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది.

బ్లాక్ మెయిల్ నిజమే..
ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీస్ స్టేషన్‌లో (Police Station) 2024 ఫిబ్రవరిలో వైసీపీ(YSRCP) నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొలుత ఈ కేసు నమోదైంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక, ఈ కేసును కూటమి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. అయితే, ఈ కేసులో సీఐడీ తొలుత దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోని (Charge Sheet) సాంకేతిక లోపాలను సరిదిద్దాలని కోర్టు ఆదేశించడంతో, దర్యాప్తు సంస్థ శుక్రవారం అన్ని ఆధారాలతో కూడిన పూర్తిస్థాయి ఛార్జిషీట్‌ను సమర్పించింది.

సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపించి, విద్యాసాగ‌ర్‌పై (Vidyasagar) అత్యాచారం కేసు (Rape Case) పెడతానని జత్వానీ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించింది. తన పరువు కాపాడుకునేందుకు విద్యాసాగర్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు పేర్కొనగా.. సీఐడీ సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ రికార్డులను పరిశీలించింది. విద్యాసాగర్ రెండు బ్యాంక్ ఖాతాల నుండి నేరుగా కాదంబరి జత్వానీ, ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకు పలు దఫాలుగా మొత్తం రూ. 1.32 కోట్లు బదిలీ అయినట్లు సీఐడీ ఆధారాలను కోర్టుకు సమర్పించింది. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, SMSల‌ రికార్డులను విశ్లేషించిన దర్యాప్తు సంస్థ.. జత్వానీ హనీ ట్రాప్ (Jethwani Honey Trap), బ్లాక్‌మెయిలింగ్‌కు (Blackmailing) పాల్పడినట్లు తేల్చింది.

ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ల వెనుక అసలు కథేంటి?
ఈ కేసును అడ్డం పెట్టుకుని గతంలో వైసీపీని (YSRCP), ఆ పార్టీ నాయకులపై టీడీపీ (TDP) అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసిందనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంలోకి జేఎస్‌డబ్ల్యూ (JSW) అధినేత జిందాల్ (Jindal) పేరును సైతం లాగే ప్రయత్నం జరిగిందని, ఆ వేధింపులు భ‌రించ‌లేకే అత‌ను ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌లేక ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిపోయార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

అంతేకాకుండా, జత్వానీ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని గతంలో రాష్ట్రంలో సిన్సియ‌ర్‌ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ (Vishal Gunni), పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu), క్రాంతి రానా టాటాలను (Kranti Rana Tata) సస్పెండ్ చేశారని, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని గుర్తుచేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. పీఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఉన్నతాధికారిని జైలుకు సైతం పంపించారు. కానీ, నేడు స్వయంగా కూటమి ప్రభుత్వం కింద పనిచేస్తున్న సీఐడీయే.. “కాదంబరి జత్వానీ డ‌బ్బుల కోసం విద్యాసాగర్‌ను బెదిరించి రూ. 1.32 కోట్లు వసూలు చేసింది” అని అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

మొదట బాధితురాలిగా ప్రచారంలోకి వచ్చిన నటి, ఇప్పుడు దర్యాప్తు సంస్థల సాంకేతిక ఆధారాల ప్రకారం “బ్లాక్ మెయిలర్” గా తేలడం.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఐపీఎస్ అధికారుల కెరీర్‌లను పణంగా పెట్టారా? అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు చట్టపరమైన ఆధారాల మధ్య నలుగుతున్న ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment