బెడిసికొట్టిన నారా లోకేష్ పబ్లిసిటీ.. నెటిజ‌న్ల సెటైర్లు

బెడిసికొట్టిన నారా లోకేష్ పబ్లిసిటీ.. నెటిజ‌న్ల సెటైర్లు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రచార ఆర్భాటం బూమ్‌రాంగ్(boomerang) అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలను(Government Schools) కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతున్నానంటూ, గత ప్రభుత్వ ‘నాడు-నేడు’ (Nadu-Nedu)అభివృద్ధి క్రెడిట్‌ను కూడా తన‌ ఖాతాలో వేసుకునేందుకు యత్నిస్తున్న మంత్రి లోకేష్.. తన సొంత కుమారుడిని మాత్రం పక్క రాష్ట్రమైన తెలంగాణలోని(Telangana) హైదరాబాద్‌లో(Hyderabad) చదివిస్తుండటం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

హైదరాబాద్‌లో చదువుతున్న తన కుమారుడు దేవాన్ష్‌ పాఠశాలలో(Devansh School) జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్‌కు (PTM) ఏ హంగామా లేకుండా సాధారణ తండ్రిగా వెళ్లారంటూ నారా లోకేష్ టీమ్ ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసి వైర‌ల్ చేస్తోంది.

పదవులు, అధికారం(Power), సంపాదన ఆంధ్రప్రదేశ్‌లో కావాలి కానీ.. నివాసం, వ్యాపారాలు, పిల్లల చదువులు మాత్రం తెలంగాణలోనేనా(Telangana)? అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో సెటైర్లు వేస్తున్నారు.

ఏపీలో ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలను తీసుకొస్తున్నామనే మాట‌ల‌న్నీ నీటి మీది బుడ‌గ‌లేనా..? కనీసం తన కొడుకును ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో కాదు కదా.. ప్రైవేట్ లేదా కార్పొరేట్ స్కూళ్లలో చదివించడానికి కూడా ఇష్టపడలేదా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏపీ విద్యావ్యవస్థ బాగోలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రే పరోక్షంగా అంగీకరించినట్లయిందని విమర్శిస్తున్నారు.

నారా లోకేష్(Nara Lokesh) వ్యవహార శైలిపై ఏపీలోని త‌ల్లిదండ్రులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి తన సొంత బిడ్డను రాష్ట్రంలో చదివించలేకపోవడం అంటే, తాను పర్యవేక్షిస్తున్న శాఖలోని లోపాలను, విద్యా ప్రమాణాల క్షీణతను ఆయనే స్వయంగా ఒప్పుకోవడమేనని విశ్లేషిస్తున్నారు.

తన పబ్లిసిటీ పిచ్చితో సాధారణ ప్రజలకు ఏపీ విద్యావ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఆయనే దెబ్బతీశారని, త‌న కొడుకు ప‌క్క రాష్ట్రంలో చ‌దువుతున్న విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేసుకొని, ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విద్యా శాఖ‌పై ఉన్న న‌మ్మ‌కాన్ని స‌న్న‌గిల్లేలా చేశార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

ఏపీ విద్యార్థులకు, ప్రజలకు సుభాషితాలు చెబుతూ కార్పొరేట్ చదువులు అందిస్తున్నామని గొప్పలు చెప్పే నాయకులు.. ఆచరణలోకి వచ్చేసరికి పక్క రాష్ట్రాలకు మొగ్గు చూపడం వారి ద్వంద్వ విధానాలకు అద్దం పడుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

https://x.com/YSRCP_Italy/status/2107523215551824345?s=20

Join WhatsApp

Join Now

Leave a Comment