నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలంలోని సోమశిల (Somasila) సమీపంలో కృష్ణానది జలాల్లో విలీనమైన చారిత్రక సంగమేశ్వరాలయం (Sangameshwara Temple) బయటపడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వేసవి కాలం చివరిలో నీటి మట్టాలు (Water Levels) కనిష్టానికి చేరినప్పుడు మాత్రమే బయటపడే ఈ ఆలయం, 25 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంత త్వరగా పైకి తేలడం గమనార్హం.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణానదిలో నీటిమట్టం పడిపోయి సంగమేశ్వరాలయం ఇలాగే బయటపడింది. ఆ తర్వాత మళ్లీ 25 ఏళ్లకు, ఇప్పుడు తెలంగాణలో (Telangana) రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో ఆలయం ప్రత్యక్షమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సాధారణంగా ప్రతి ఏటా ఎండకాలంలో మే లేదా జూన్ నెలల్లో మాత్రమే నీటిమట్టం తగ్గి ఆలయం కొద్దిరోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చేది. కానీ వర్షాకాలం వచ్చిపోయినా కూడా నదిలో నీరు లేక ఆలయం పూర్తిగా బయటపడటం తీవ్ర కరువు పరిస్థితులకు అద్దం పడుతోందని స్థానికులు, పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణమ్మ ప్రవాహం తగ్గి ఆలయం బయటపడటంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, పర్యాటకులు సంగమేశ్వరుడి దర్శనం కోసం సోమశిలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.








