అమరావతిలోని సచివాలయంలో(Secretariat) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి మొత్తం 12 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయం, వైద్యం, విద్య, సంక్షేమం, భూ వర్గీకరణ, ఉన్నత విద్యకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- AP HIMS ఏర్పాటుకు రూ.20.62 కోట్లు.. 72 నెలల అమలు.
- రేపల్లె 30 పడకల CHCని (CHC – Community Health Centre) 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్.. రూ.58.42 కోట్లు, 66 పోస్టులు.
- 2026-27 తల్లికి వందనం (Thalliki Vandanam) మార్గదర్శకాలకు రాటిఫికేషన్.
- సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీల (Diet Charges) పెంపునకు ఆమోదం.
- విశాఖ మారికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(Centre of Excellence) ఏర్పాటు.
- కుప్పంలో అతిథి గృహం కోసం 1.69 ఎకరాల భూ వర్గీకరణ మార్పు.
- ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు రాటిఫికేషన్.
- కడప పాతూరులో ఆలయ అభివృద్ధికి 7.66 ఎకరాల భూమి దేవాదాయ శాఖకు బదలాయింపు.
- కొండపిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ కోసం 7 ఎకరాల భూ వర్గీకరణ మార్పు.
- ఏపీ విద్యా చట్టం-1982 సవరణలకు ఆమోదం.
- విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ వర్సిటీల క్యాంపస్ల కోసం కొత్తపాలసీ-2026కు గ్రీన్ సిగ్నల్.
- క్యాంపస్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సదుపాయాలపై సమగ్ర విధానం రూపొందించేందుకు ఆమోదం.








