ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) డీఎస్సీ-2025 (DSC-2025) వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. స్పోర్ట్స్ కోటాలో(Sports Quota) నియామకాలపై శాసనసభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష నిర్వహించకుండా ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని లోకేష్ అంగీకరించారు. దీంతో డీఎస్సీలో(DSC) అక్రమాలు (Irregularities) జరిగాయన్న తమ వాదన వాస్తవం అని వైసీపీ(YSRCP) నేతలు చెబుతున్నారు.
శాసనసభలో డీఎస్సీ నియామకాలపై వివరణ ఇచ్చిన మంత్రి నారా లోకేష్.. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో(International Level) దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారిణి పీవీ సింధుకు(PV Sindhu) రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇచ్చామని లోకేష్ ఉదహరించారు. అంతర్జాతీయ క్రీడాకారుల (International Sportspersons) తరహాలోనే స్పోర్ట్స్ కోటాలో ఇతరులకు కూడా రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని లోకేష్ చెప్పడం గమనార్హం.
ఈ ప్రకటనతో చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) ఇరుక్కుపోయిందని, స్పోర్ట్స్ కోటాలో నియామకాలపై తమ ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పినట్లయిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో ప్రభుత్వం తొలుత జారీ చేసిన జీవో 47ను మళ్లీ రద్దు చేసి, రాత పరీక్ష నిర్వహించేలా జీవో 56ను తీసుకురావడంపై కూడా వైసీపీ ప్రశ్నలు లేవనెత్తుతోంది.
రాత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టిన తర్వాత నిబంధనలను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) జారీ చేసిన జీవోల్లో మార్పులు చేయడం ద్వారా గతంలో తీసుకున్న నిర్ణయంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని వైసీపీ వాదిస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన పీవీ సింధును(PV Sindhu).. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నియమితులైన 383 మందితో ఒకేలా పోల్చడంపై డీఎస్సీ అభ్యర్థులు, రాజకీయ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. క్రీడా రంగంలో దేశానికి ప్రతిష్ఠ తీసుకొచ్చిన సింధు వంటి క్రీడాకారిణిని ఉదాహరణగా చూపి మిగిలిన నియామకాలను సమర్థించడం సమంజసం కాదని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలోని యువత, డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అనుసరిస్తోందని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. డీఎస్సీ నియామకాల విషయంలో ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ గతంలో ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాటిపై ఇప్పటివరకు సమగ్ర విచారణ ఎందుకు జరగలేదని ప్రశ్నిస్తున్నారు.
డీఎస్సీ-2025లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని వైసీపీ(YSRCP) మరోసారి డిమాండ్ చేసింది. రాత పరీక్ష లేకుండా నియామకాలు ఎలా జరిగాయి? తర్వాత జీవో 47ను ఎందుకు రద్దు చేశారు? జీవో 56ను ఎందుకు తీసుకువచ్చారు? ఉద్యోగాల అమ్మకాల ఆరోపణలకు సంబంధించిన ఆడియో, వీడియోలపై విచారణ ఎందుకు జరగలేదనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతోంది.
మొత్తంగా డీఎస్సీ నియామకాలపై విద్యా శాఖ మంత్రి ఇచ్చిన వివరణలే అనేక అనుమానాలకు తావిస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పరీక్ష పెట్టలేదని అంగీకరించిన లోకేష్.
— Telugu Feed (@Telugufeedsite) August 17, 2026
పీవీ సింధుకి రిటన్ టెస్ట్ లేకుండా ఉద్యోగం ఇచ్చాం
అలానే అందరికీ డీఎస్సీలో పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చాం
లోకేష్ ప్రకటనపై సర్వత్రా విమర్శలు pic.twitter.com/dehSmphvCe








