డీఎస్సీలో చిన్న తప్పు జరిగింది.. – మండలిలో మంత్రి అచ్చెన్న వీడియో వైర‌ల్‌

డీఎస్సీలో చిన్న తప్పు జరిగింది.. - మండలిలో మంత్రి అచ్చెన్న వీడియో వైర‌ల్‌

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) శాసనసభ (Legislative Assembly) వర్షాకాల సమావేశాల (Monsoon Session) తొలిరోజే డీఎస్సీ-2025 (DSC-2025) వ్యవహారం రాజకీయ వేడి పెంచింది. డీఎస్సీలో అవకతవకలు (DSC Irregularities) జరిగాయని, దీనిపై సీబీఐతో(CBI) విచారణ (Investigation) జరిపించాలని వైసీపీ (YSRCP) డిమాండ్ చేస్తుండగా.. ఇదే అంశంపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

డీఎస్సీ-2025లో అక్రమాలు, అవకతవకలపై చర్చించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు (YSRCP MLCs) శాసనమండలిలో(Legislative Council) వాయిదా తీర్మానం ఇచ్చారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున‌ వైసీపీ పోరాటం చేస్తోంది.

డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా (DSC Sports Quota) పేరుతో అక్రమాలు జరిగాయని, అర్హత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కకుండా నచ్చిన వారికి అవకాశాలు కల్పించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు డీఎస్సీ అభ్యర్థులు (DSC Candidates) కూడా ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో డీఎస్సీ అంశంపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. దీంతో ప్ర‌తిప‌క్ష వైసీపీని ఎదుర్కొనేందుకు అధికార పక్షం తరఫున ఏడుగురు మంత్రులు శాసనమండలికి హాజర‌య్యారు.

వైసీపీ డీఎస్సీపై చర్చకు డిమాండ్ చేస్తున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘‘డీఎస్సీలో ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్షా. చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి’’ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డీఎస్సీలో తప్పు జరిగిందని చట్టసభ సాక్షిగా మంత్రి అంగీకరించారంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న సమయంలో.. అధికార పార్టీకి చెందిన మంత్రి ‘చిన్న పొరపాటు జరిగింది’(A Minor Mistake Happened) అని వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

‘తప్పు జరిగిందని సహచర మంత్రి చెబుతున్నప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తారా? రాజీనామా చేస్తారా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి వాస్తవాలను వెల్లడించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డీఎస్సీ వ్యవహారంపై రాజకీయ చర్చ మరింత ముదిరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment