ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Summarize with AI

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి నంద‌మూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. “నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో నాకు తెలుసు. ఆయన మృతి వెనుక ఎంతటి కుట్రలు జరిగాయో, ఆ దుర్మార్గులు ఏ విధంగా వ్యవహరించారో నాకు స్పష్టంగా తెలుసు. గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నా. ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.

“నేను చేసిన తప్పు ఏంటి?”
ఆమె ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. “నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు. అందరి సమక్షంలోనే ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ నాపై ఈ తప్పుడు ఆరోపణలు, విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు” అని పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి తన వ్యాఖ్యల ద్వారా ఎన్టీఆర్ మృతిపై ఉన్న వివాదాలు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆమె మాటలు ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment