ఇటీవల తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలపై(MLCs) లైంగిక వేధింపుల (Sexual Harassment) కేసులు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలోని ఓ మంత్రి (Minister) తన పరిధిలోని పోలీసులను(Police) ఉపయోగించుకుని ప్రజాప్రతినిధులపై ఈ తరహా కేసులు నమోదు చేయించారని ఆయన ఆరోపించారు. ఈ కేసులను చట్టపరంగా న్యాయస్థానంలో ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లో(Hyderabad) జరిగిన మిస్ వరల్డ్(Miss World) పోటీల సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులపై(Congress Leaders) మిస్ ఇంగ్లాండ్ (Miss England) చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. నిందితులను తెలంగాణ పోలీసులు కాపాడుతూనే ఉంటారా అంటూ డీజీపీని(DGP) ప్రశ్నించిన కేటీఆర్, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.








