మహిళా న్యాయవాదిపై న‌డిరోడ్డుపై టీడీపీ దాడి (Video)

మహిళా న్యాయవాదిపై న‌డిరోడ్డుపై టీడీపీ దాడి (Video)

Summarize with AI

టీడీపీ నేతల అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్త, న్యాయవాది స్వర్ణలతపై దాడి ఘటన ఏలూరులో కలకలం రేపింది. ఏలూరు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శిరీష అనే మహిళ స్వర్ణలతపై దాడికి పాల్పడింది. ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ, జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

టీడీపీ నేతల అక్రమాలను ప్రశ్నించినందుకు గతంలోనూ తనను దుర్భాషలాడటంతో పాటు దాడికి యత్నించారని స్వర్ణలత తెలిపారు. ఏలూరులో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కంప్యూటర్‌ ప్రసాద్‌ అక్రమాల చిట్టాను బయటపెట్టినందుకే తనపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న దాడులు, వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఓ మహిళా న్యాయవాదిపై దాడి జరగడం మహిళల భద్రత, శాంతిభద్రతల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్వర్ణలత చేసిన వ్యాఖ్యలపై సంబంధిత టీడీపీ నేతలు, పోలీసుల స్పందన తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment