‘ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్’ నామినేష‌న్‌లో బూమ్రాకు చోటు

'ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్' నామినేష‌న్‌లో జస్ప్రీత్ బూమ్రాకు చోటు

Summarize with AI

2024 సంవత్సరానికి గాను “ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌” నామినేషన్‌లలో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా కూడా చోటు సంపాదించాడు. బూమ్రాతోపాటు ఇంగ్లండ్‌కు చెందిన జోయ్ రూట్, హ్యారీ బ్రూక్, అలాగే శ్రీలంకకు చెందిన కామిందు మెండిస్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు.

భారత క్రికెట్‌కు బలమైన శక్తిగా..
బూమ్రా తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024లో 13 టెస్టు మ్యాచ్‌లలో 71 వికెట్లు, 14.92 సగటుతో, 30.16 స్ట్రైక్‌ రేట్‌తో విశేష ప్రతిభ కనబర్చాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం 4 మ్యాచ్‌లలో 30 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. బ్యాక్ పెయిన్‌ సమస్యల నుంచి కోలుకుని మరింత శక్తివంతమైన బౌలింగ్‌ ప్రదర్శించాడు.

నామినేట్ అయిన క్రికెటర్లు
జోయ్ రూట్ (ఇంగ్లండ్) 2024లో 17 టెస్టుల్లో 1,556 పరుగులు, 55.57 సగటుతో మెరుగైన ప్రదర్శన చేశాడు. హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్) 12 టెస్టుల్లో 1,100 పరుగులు, ఒక మ్యాచ్‌లో 317 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. మెండిస్ (శ్రీలంక) కేవలం 9 టెస్టుల్లో 1,049 పరుగులు, 74.92 సగటుతో అత్యద్భుత ప్రదర్శన క‌న‌బ‌ర్చాడు. 2024లో తన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను మంత్ర ముగ్ధులను చేసిన బూమ్రా ఈ అవార్డు గెలుచుకునే అవకాశాలున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment