బ‌య‌టప‌డుతున్న‌ జనసేన ‘కోట’ ర‌హ‌స్యం.. ధ‌ర‌ణీకృష్ణ సంచ‌ల‌న వీడియో

బ‌య‌టప‌డుతున్న‌ జనసేన ‘కోట’ ర‌హ‌స్యం.. ధ‌ర‌ణీకృష్ణ సంచ‌ల‌న వీడియో

Summarize with AI

జనసేనలో(Jana Sena) కోట్ల రూపాయల ఉద్యోగాల స్కామ్(Job Scam) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు సంబంధించిన వివాదంగా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ రహస్య సమాచార భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan సన్నిహితురాలు కోట రుక్మిణి(Kota Rukmini), జనసేన నాయకుడు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కేకే) (Kalyanam Siva Srinivas – KK) పాత్రపై ధరణీకృష్ణష్ణ (Dharani Krishna) మరోసారి సంచలన వీడియోలు విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన డ్యాష్‌బోర్డు, ఈ-సర్వీస్ రిజిస్టర్ వివరాలను కేకే లీక్ చేశారని ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ప్రభుత్వ ఆధీనంలో అత్యంత భద్రంగా ఉండాల్సిన ఉద్యోగుల వ్యక్తిగత, సర్వీసు వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయి? జనసేన నాయకులు తమ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ సమాచారాన్ని ఆర్థిక లావాదేవీలకు వినియోగించారా? ధరణీకృష్ణ ష్ణ (Dharani Krishna) తాజా వీడియోలతో ఈ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ప్రభుత్వ ఉద్యోగాల డ్యాష్‌బోర్డు, ఈ-సర్వీస్ రిజిస్టర్ వివరాలు పెద్దిరాజు అనే వ్యక్తికి కేకే ఇవ్వకుండా ఎక్కడి నుంచి వచ్చాయని ధరణీకృష్ణ ప్రశ్నించారు. డిపార్ట్‌మెంట్ మొత్తం కేకే చేతుల్లో ఉందని, అందుకే ఆయన ఏమైనా చేయగలరని వ్యాఖ్యానించారు. ఆమె ఆరోపణలు నిజమైతే ఇది కేవలం ఉద్యోగాల స్కామ్ మాత్రమే కాదు.. ప్రభుత్వ సమాచార భద్రతకు సంబంధించిన తీవ్రమైన వ్యవహారం కూడా.

అసలు జనసేన(Jana Sena) నాయకులు రూ.7 కోట్లు వసూలు చేశారా? రూ.70 కోట్లు వసూలు చేశారా? ఎవరికి తెలుసని ధరణీకృష్ణ ప్రశ్నించారు. కేకే, పెద్దిరాజు మధ్య ఆర్థిక సంబంధాలు బయటపడకుండా తనను బలిపశువును చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.7 కోట్ల స్కామ్ తానే చేశానని చెబుతున్నారని, తనకు ఆ డబ్బు ఎవరు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? అని నిలదీశారు. మొత్తం వ్యవహారంలో కేకే, పెద్దిరాజులే కీలకంగా వ్యవహరించారని, కోట రుక్మిణి, కేకే కలిసి తనపై తప్పుడు కేసు పెట్టించారని పేర్కొన్నారు. నిజంగా 36 మంది బాధితులు ఉంటే వారెక్కడున్నారని, వారితో ఎందుకు కేసులు పెట్టించలేదని ప్రశ్నించారు.

2021 నుంచి తనకు జనసేన సభ్యత్వం (Jana Sena Membership) ఉందని ధరణీకృష్ణ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కోసం ఎంతో కష్టపడ్డానని, పార్టీ ఎన్నికల యాప్‌ను (Party Election App) రూపొందించింది తానేనని స్పష్టం చేశారు. వ్యవహారం బయటపడిన తర్వాత తనకు జనసేనతో సంబంధం లేదని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. లాగిన్ యాక్సెస్‌లను తొలగించవచ్చుగానీ, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇతర కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లను చూపించి తనపై హ్యాబిచ్యువల్ చీటర్‌గా (Habitual Cheater) ముద్ర వేస్తున్నారని, సంబంధం లేని వ్యక్తులను తన భర్తగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హరిప్రసాద్, పవన్ బాలాజీ, సుధీర్ పేర్లు చెప్పాలని పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. అనంతపురానికి చెందిన జయరాం రెడ్డి (Jayaram Reddy) ఇచ్చిన రూ.9 లక్షలు మేయర్ సీటు కోసం ప్రయత్నిస్తున్న ఆయనకు సోషల్ మీడియా ప్రచారం, పొలిటికల్ అనలిస్ట్ సేవలు అందించేందుకు తీసుకున్నవేనని వివరించారు.

కేకే తనను బతకనివ్వరని, తనకు ప్రాణహాని ఉందని ధరణీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఏదైనా జరిగితే అందుకు కేకే కారణమని పేర్కొన్నారు. తనలా మరో మహిళను జనసేన నాయకులు హింసించకూడదని, మరో కుటుంబం బాధపడకూడదనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న ఆధారాలన్నీ బయటపెడతానని స్పష్టం చేశారు. తమకు అనుకూలమైన మీడియా సంస్థల ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు, జనసేనలో కట్టప్పలు ఉన్నారని, తనను పవన్ కల్యాణ్‌కు దూరం చేసేందుకు వెన్నుపోటు పొడుస్తున్నారని కేకే వ్యాఖ్యానించారు. న్యాయం కోసం తన పోరాటం చట్టపరంగానే ఉంటుందని కోట రుక్మిణి ట్వీట్ చేశారు.

అధికార పదవుల్లో ఉన్న జనసేన నాయకులపై ప్రభుత్వ సమాచారం లీక్ చేశారనే ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన అంశం. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు ప్రైవేటు వ్యక్తులకు ఎలా చేరాయి? ప్రభుత్వ డ్యాష్‌బోర్డులకు ఎవరెవరికి యాక్సెస్ ఉంది? ఉద్యోగాల పేరుతో వసూళ్లకు ఈ సమాచారాన్ని ఉపయోగించారా? ఈ వ్యవహారంలో కోట రుక్మిణి, కేకే పాత్ర ఏమిటి? అన్నది తేలాల్సి ఉంది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సన్నిహితులపై వస్తున్న ఈ ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు? ప్రభుత్వ సమాచార భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలతో పాటు ప్రభుత్వ డేటా యాక్సెస్, లాగిన్ రికార్డులపైనా స్వతంత్ర విచారణ జరిపితేనే ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు బయటపడతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment