ఓ వృద్ధ మహిళపై (Elderly Woman) సర్కిల్ ఇన్‌స్పెక్టర్(CI) అసభ్యకరంగా, అత్యంత జుగుప్సాకరమైన భాషలో (Disgusting Language)రెచ్చిపోయిన తీరు సభ్య సమాజాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. బాపట్ల జిల్లా చీరాలలో(Chirala) పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీరాల రెండో పట్టణ సీఐ శివకుమార్ (CI Shivakumar) ఓ వృద్ధ మహిళను బూతులు తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఏపీ పోలీసు శాఖ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. చీరాల రామ్‌నగర్‌లో ఆదివారం (సెప్టెంబర్ 6) పోలీసులు(Police) కార్డన్ సెర్చ్(Cordon Search) నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఎస్టీ ఎరుకల సామాజిక వర్గానికి (ST Yerukula community) చెందిన ఓ వృద్ధ మహిళ ఇంటికి వచ్చిన పోలీసులు.. ఆమెపై అసభ్యకర పదజాలంతో రెచ్చిపోయారు. సీఐ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సీఐ వృద్ధ మహిళతో తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుండటంతో పాటు, అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించినట్లు వీడియోలో తెలుస్తోంది. దీంతో పోలీసు అధికారుల ప్రవర్తనపై పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారులు వృద్ధులు, మహిళలు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలతో మరింత సంయమనంతో, గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు, పలువురు సామాజికవేత్తలు పేర్కొంటున్నారు.
ఒకవైపు ప్రజలకు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత కాగా.. మరోవైపు పోలీసుల ప్రవర్తనపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగించే అంశంగా మారిందని వారు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి సీఐ శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దెం**నీ అమ్మ కు** ప***ద్ది.. ఏయే.. తో*తే నా మ** లో**కి వస్తది
— Telugu Feed (@Telugufeedsite) September 7, 2026
వృద్ధ మహిళపై బూతులతో రెచ్చిపోయిన చీరాల సీఐ
ఎస్టీ ఎరుకల వృద్ధ మహిళపై బూతులతో రెచ్చిపోయిన రెండో పట్టణ సీఐ శివకుమార్
చీరాల రామ్‌నగర్‌లో సెప్టెంబర్ 6న కార్డన్ సెర్చ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు… pic.twitter.com/iIRoFLASlV








