HYDలో ఉద్రిక్తత.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్

HYDలో ఉద్రిక్తత.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్

Summarize with AI

హైదరాబాద్‌లో (Hyderabad) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాంచందర్ రావు (Ramchander Rao) ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కామారెడ్డి (Komareddy) వెళ్లేందుకు రాంచందర్ రావు యత్నించగా, ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఆయనను, ఇతర బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పోలీస్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

చివరకు పోలీసులు రాంచందర్ రావును అదుపులోకి తీసుకుని అరెస్ట్(Arrest) చేశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ(BJP) నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం రాంచందర్ రావును బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చలు ముదురగా, బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కామారెడ్డి పర్యటనను అడ్డుకోవడంపై పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment