“కౌంటింగ్ సెంటర్‌లో బాల‌కృష్ణ పీఏ హల్‌చల్

హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో బాలకృష్ణ పీఏ హల్‌చల్..

Summarize with AI

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు నిబంధనల‌ను తొక్కేసి కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి హల్‌చల్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఒక ఎమ్మెల్యే పీఏ స్థాయి వ్యక్తి కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి ఏ అధికారి ఎక్కడ ఉండాలి? ఎవరు ఏ విధులను నిర్వహించాలి? అంటూ ఎన్నికల అధికారులకే హుకూం జారీ చేయడం, పోలీసులకు సైతం ఆదేశాలు ఇవ్వడం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ జోక్యం చేసుకోవడంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి.

కౌంటింగ్ కేంద్రంలోకి పాస్ ఉన్న ఏజెంట్లు, అధికారులు తప్ప ఇతరులకు ప్రవేశం లేదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే పీఏ ఏ హక్కుతో కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లి అధికారులను శాసిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

మ‌రోవైపు కౌంటింగ్ ప్రక్రియ ముగిసి వార్డుల వారీగా అభ్యర్థులు బయటకు వస్తున్నప్పటికీ, ఎవరు గెలిచారు? ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? అనే అధికారిక ఫలితాల వివరాలను వెల్లడించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. అధికారిక ఫలితాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు అందించాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి, కౌంటింగ్ వివరాలను తొక్కిపెట్టడం వెనుక ఏ విధమైన పచ్చ కుట్రలు సాగుతున్నాయని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment