హెచ్‌సీయూలో బుల్డోజ‌ర్లు.. ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు

హెచ్‌సీయూలో బుల్డోజ‌ర్లు.. ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు

Summarize with AI

రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) రెవెన్యూ సర్వే నం.25లో ఉన్న 400 ఎకరాల భూమి ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ భూములపై హక్కు తమదేనని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ (HCU) విద్యార్థులు గతకొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఈ భూములు ప్రభుత్వానికే చెందినవని, సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టతనిచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వాదిస్తోంది. భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు 400 ఎక‌రాల‌ను చ‌దును చేసి కంచె (Fence) నిర్మించేందుకు బుల్డోజ‌ర్ల‌ను పంపించింది.

రాత్రింబ‌వ‌ళ్లు జేసీబీ (JCB) ల‌తో భూమి చ‌దును ప‌నులు కొన‌సాగుతుండ‌గా ఆ అట‌వీ ప్రాంతంలోని నెమ‌ళ్లు (Deer), జింక‌లు (Wild Boars) భ‌యాంతో కేక‌లు వేస్తున్న దృశ్యాలు ప్ర‌కృతి ప్రేమికుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. యూనివ‌ర్సిటీ (University) భూముల స్వాధీనంపై బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి.

విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతుండగా, తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) స్పందించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. “ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదు. ప్రకృతిని నాశనం చేయడం, నిరసన వ్యక్తిస్తున్న విద్యార్థులను హింసించడం సరైంది కాదు. ఇలాంటి అన్యాయానికి వ్యతిరేకంగా నేను విద్యార్థులకు, పౌరులకు మద్దతు ఇస్తున్నాను. మన భవిష్యత్తు కోసం చేసే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలి” అంటూ ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment