రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు.. రేవంత్ సర్కార్‌పై హరీష్‌రావు ఫైర్

రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు.. రేవంత్ సర్కార్‌పై హరీష్‌రావు ఫైర్


తెలంగాణ ప్రభుత్వంపై (Telangana Government) బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత హరీష్‌రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమం (Farmers Welfare) పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇప్పుడు రైతులను(Farmers) పూర్తిగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి Revanth Reddy) అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని, మొనగాడిగా చెప్పుకుంటూ చివరకు మోసగాడిగా నిరూపించుకున్నారని విమర్శించారు. కేసీఆర్(KCR) హయాంలో రైతుబంధు పథకం (Rythu Bandhu Scheme) ఎప్పుడూ ఆగలేదని, క్రమం తప్పకుండా రైతులకు ఆర్థిక సాయం అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతుబంధు, రైతు బీమా (Rythu Bima) వంటి పథకాలు కనిపించడం లేదని, రైతులకు కనీసం సరిపడా విద్యుత్ కూడా అందడం లేదని మండిపడ్డారు.

రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం చివరకు బోగస్ హామీలకే పరిమితమైందని హరీష్‌రావు విమర్శించారు. ఎస్‌బీఐని (SBI – State Bank of India) కూడా ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ (Blackmail) చేస్తోందని ఆరోపించిన ఆయన, సీఎం వద్ద మనసు లేకపోవడం వల్లే రైతులకు నిధులు విడుదల కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఒకవైపు వందల కోట్లతో క్యాంప్ ఆఫీసులు నిర్మించుకుంటూ మరోవైపు రైతుల కోసం నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రాల ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించిన హరీష్‌రావు, ప్రజలు ఇప్పుడు స్కామ్‌ల ప్రభుత్వం (Schemes Government) కాకుండా స్కీమ్‌ల ప్రభుత్వం (Scams Government) కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment