అన‌గానే స‌రిపోతుందా.. స్వీక‌రించే ద‌మ్ముండొద్దు..!!

అన‌గానే స‌రిపోతుందా.. స్వీక‌రించే ద‌మ్ముండొద్దు..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజా సమస్యల చుట్టూ తిరగడం మానేసి.. వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యల వైపు మళ్లుతుండటంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనితను (Vangalapudi Anitha) ఉద్దేశించి వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) చేసిన “మేకప్ మంత్రి”(Makeup Minister) వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చ‌ర్చ‌కు దారి తీశాయి.

వంగలపూడి అనితపై (Vangalapudi Anitha) గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) అంత తీవ్రంగా మండిపడటానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. ఇది ఒక రకంగా ‘యాక్షన్-రియాక్షన్’ (Action-Reaction) లాంటిదేనని స్పష్టమవుతోంది. గతంలో అనిత.. గుడివాడ అమర్‌నాథ్ పేరు ఎత్తకుండానే “గుడ్డు మంత్రి” (Egg Minister) అంటూ వెటకారం చేశారు. అంతేకాకుండా, “గుడ్డు పగలగొట్టడం మాకూ తెలుసు” అంటూ సెటైర్లు విసిరారు. రాజకీయాల్లో మనం ఎదుటివారిపై ఎలాంటి బాణాలు విసురుతామో, అవతలి వైపు నుంచి కూడా అంతే స్పీడ్ గా, పదునుగా వస్తాయనే విషయాన్ని నాయకులు మర్చిపోతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. అనిత వైసీపీ(YSRCP) నేతలను, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సతీమణిని, తల్లిని ఉద్దేశించిన మాటలను క్లబ్ చేసి ట్వీట్ చేసింది.

వివాదంపై అమర్‌నాథ్ వివరణ
ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎక్స్ వేదికగా స్పందించారు. “నేను మహిళా లోకం పై మాట్లాడలేదు… కేవలం ఒక వ్యక్తి సభ్యత, సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు మాత్రమే ఖండించాను” అని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా కాకుండా కేవలం సిద్ధాంతపరమైన ప్రత్యామ్నాయాలుగా భావించి, గౌరవప్రదంగా విమర్శించుకుంటే ఇలాంటి వివాదాలకు తావుండదు. “మేము మహిళలం(Womens) కాబట్టి ఏమైనా మాట్లాడొచ్చు” అని, ఎదుటివారు ఏ స్థాయి వారైనా ఏక‌వ‌చ‌నంతో మాట్లాడొచ్చు, వ్యంగ్యం ముసుగులో కొంత ప‌రుష ప‌ద‌జాలం తోడైతే.. ఎదుటివారి నుంచి వ‌చ్చే స‌మాధానాల‌ను సైతం స్వీక‌రించాల్సి ఉంటుంది. ఈ ర‌క‌మైన మాట‌ల పోక‌డ‌లు సమస్యలు మరింత జటిలం చేస్తాయంటున్నారు రాజ‌కీయ పండితులు.

రాజకీయ నాయకులు తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు కానీ, సమాజం ప్రతి ఒక్కరి సభ్యతను, సంస్కారాన్ని నిశితంగా గమనిస్తూనే ఉంటుంది. అంతిమంగా నాయకుల రాజకీయ జాతకాలను తేల్చేది ప్రజలేనని గుర్తెరిగి, ఇప్పటికైనా నేతలు హుందాగా వ్యవహరిస్తే రాజకీయాలకు, రాష్ట్రానికి మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment