మూడు జేబుల్లో 30 బిస్కెట్లు.. ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయాడు

మూడు జేబుల్లో 30 బిస్కెట్లు.. ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయాడు

Summarize with AI

హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad International Airport) భారీగా బంగారం (Gold) పట్టుబడింది. దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద 3.5 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్ (Seized) చేశారు. నిందితుడు 30 బంగారం బిస్కెట్‌ (Gold Biscuits)లను జేబుల్లో (Pockets) అమర్చుకొని వస్తుండగా అధికారులు గుర్తించారు.

బంగారం స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు సీజ్ చేసిన బంగారం విలువ సుమారు రూ.3.45 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విదేశీ బంగారాన్ని అక్రమంగా దేశంలోకి స్మ‌గ్లింగ్ చేయడం పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, స్మ‌గ్ల‌ర్స్‌ నెట్‌వర్క్‌పై విచారణ జరుపుతున్నారు. ఈ కేసు తాలూకు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

ఎయిర్‌పోర్ట్స్ కేంద్రంగా ఇటీవ‌ల బంగారం అక్ర‌మ ర‌వాణాలు జోరందుకున్నాయి. క‌ర్ణాట‌క‌లో ఓ న‌టి కాంట్రాక్ట్ కుదుర్చుకొని మ‌రీ దుబాయ్ నుంచి దేశానికి అక్ర‌మంగా బంగారాన్ని స‌ర‌ఫ‌రా చేస్తూ ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనూ బంగారం అక్ర‌మ ర‌వాణాపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు అధికారులు. ముఖ్యంగా దుబాయ్ నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment