నా కూతురు బతికుందో లేదో తెలియదు.. – ధరణికృష్ణ తల్లి సంచలన వీడియో

నా కూతురు బతికుందో లేదో తెలియదు.. – ధరణికృష్ణ తల్లి సంచలన వీడియో

Summarize with AI

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పీఏ, జనసేన నాయ‌కురాలు కోట రుక్మిణీకి సంబంధించిన రూ.7 కోట్ల మోసం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధరణికృష్ణ తల్లి నాగమణి సంచలన వీడియో విడుదల చేశారు. సీఐడీ పోలీసులు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన కుమార్తె ఎక్కడుందో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కన్నీటితో వేడుకున్నారు.

రూ.7 కోట్ల మోసం కేసుతో తన కుమార్తెకు ఎలాంటి సంబంధం లేదని నాగమణి స్పష్టం చేశారు. కోట రుక్మిణి వద్ద పనిచేసిన ధరణికృష్ణ స్వచ్ఛందంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిందని తెలిపారు. అక్కడ తన కుమార్తెను మూడు రోజులపాటు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, ఆడపిల్ల అని కూడా చూడకుండా చెప్పుకోలేని ప్రదేశాల్లో బూటు కాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతోనే తన కుమార్తెను విడుదల చేశారని పేర్కొన్నారు.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి ముందే పవన్‌ కల్యాణ్‌కు తన గోడు చెప్పుకునేందుకు జనసేన కార్యాలయానికి వెళ్లానని నాగమణి తెలిపారు. అక్కడ ఓ మహిళా న్యాయవాది తన సమస్యను వినకుండానే వెళ్లిపోవాలని చెప్పారన్నారు. పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా తన ఫిర్యాదును స్వీకరించలేదన్నారు. పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినప్పటి నుంచి తన కుమార్తె కనిపించడం లేదని, అసలు బతికుందో లేదో కూడా తెలియడం లేదని కన్నీరుమున్నీరయ్యారు.

తనతో పాటు తన చిన్న కుమార్తె, చిన్న అల్లుడిని సీఐడీ పోలీసులు వేధిస్తున్నారని నాగమణి పేర్కొన్నారు. తమ ఇంటికి వచ్చిన సీఐడీ పోలీసులు సీసీ కెమెరాలను ఆపేసి మరీ వేధింపులకు గురిచేశారని తెలిపారు. సీఐడీ పోలీసుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని పవన్‌ కల్యాణ్‌ను కోరారు.

‘‘ఇద్దరు చిన్నపిల్లలతో నేను బతకాలో, చావాలో మీరే చెప్పండి. సామాన్యులమైన మాకు బతికే హక్కు కూడా లేదా?’’ అంటూ నాగమణి కన్నీరు పెట్టుకుంటూ త‌న కుటుంబాన్ని వేధిస్తున్న జ‌న‌సేన నాయ‌కుల‌ను ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment