తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్

Summarize with AI

టాలీవుడ్‌లో విభిన్నమైన చారిత్రక చిత్రంగా ‘ఫూలే’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలేల జీవిత పోరాటం, కులవివక్షకు వ్యతిరేకంగా వారు చేసిన ఉద్యమం, మహిళా విద్య కోసం అందించిన సేవలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ నవంబర్ 27న విడుదల కానుంది. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సినిమాను వీక్షించి ప్రశంసించడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ జ్యోతిరావ్ ఫూలేగా, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలేగా నటించారు. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని, దాదాపు 200 ఏళ్ల క్రితం ఫూలే దంపతులు చేసిన పోరాటాన్ని నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నమని తెలిపారు. నవంబర్ 26న నిర్వహించే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్రతీక్ గాంధీ హాజరవుతారని వెల్లడించారు. సమానత్వం, విద్య, మహిళా హక్కుల ప్రాధాన్యతను చాటిచెప్పే ఈ చిత్రాన్ని యువత, విద్యార్థులు, కుటుంబ సభ్యులు తప్పక చూడాలని చిత్ర బృందం కోరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment