ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర నడిబొడ్డున విజయవాడ (Vijayawada) కృష్ణలంక (Krishnalanka) పోలీస్ స్టేషన్‌లో (Police Station) జరిగిన గాదె సాయికృష్ణ (Gade Saikrishna) లాకప్ డెత్ (Lockup Death) ఆరోపణల ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. “నా కొడుకును చంపేసి ఉంటే.. కనీసం వాడి బూడిదైనా ఇవ్వండి” అంటూ ఆ కన్నతల్లి(Mother) మీడియా ముందు కన్నీరు పెట్టుకొని కోర్టు మెట్లెక్కిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. జనసేన(Jana Sena) సానుభూతి పరుడు గాదె సాయికృష్ణ అనే యువకుడిపై కృష్ణలంక సీఐ నాగరాజు(CI Nagaraju) థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించి చంపేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే.. భక్షకులుగా మారితే న్యాయస్థానాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో చెప్పడానికి భారత న్యాయ చరిత్రలో అనేక చారిత్రాత్మక తీర్పులు నేడు చర్చనీయాంశంగా మారాయి.

పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై దేశాన్ని మేల్కొలిపిన, ఖాకీల గుండెల్లో వణుకు పుట్టించిన ఆ సంచలన కేసులు- తీర్పులు ఇలా ఉన్నాయి..
1. రాజన్ కేసు (1976) – కస్టోడియల్ హింసపై తొలి పెద్ద పోరాటం
ఎమర్జెన్సీ కాలంలో కేరళలో(Kerala) పీ.రాజన్ (P. Rajan) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను అదృశ్యమయ్యాడు. పోలీసులు అతడిని కోర్టులో(Court) హాజరుపరచలేకపోవడంతో కస్టడీలోనే (Custody) హత్య (Murder)జరిగిందనే అనుమానాలు బలపడ్డాయి. థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించి కస్టడీలోనే అతడిని చంపేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. ఈ కేసు భారతదేశంలో కస్టోడియల్ హింసపై జరిగిన తొలి పెద్ద ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా నిలిచింది.

2. నీలాబతి బెహెరా కేసు (1993) – “బాధ్యత ప్రభుత్వానిదే!”
ఒడిశాలో (Odisha) సుమన్ బెహెరా (Suman Behera) అనే యువకుడు పోలీస్ కస్టడీలో (Police Custody) మరణించగా, అతని తల్లి నీలాబతి బెహెరా (Nilabati Behera) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పునిచ్చింది. “కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణానికి రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. పోలీసుల వ్యక్తిగత తప్పు అని చెప్పి ప్రభుత్వం తప్పించుకోలేరని, బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే” అని కోర్టు స్పష్టం చేసింది.

3. డి.కే. బసు (D.K. Basu) వర్సెస్ పశ్చిమ బెంగాల్ (1997) – అరెస్టులపై కోర్టు గైడ్‌లైన్స్
కస్టోడియల్ డెత్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు ఈ కేసులో 11 కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ‘అరెస్ట్ మెమో’ (Arrest Memo) తయారు చేయాలి. కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఈ నిబంధనలు నేటికీ దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి.

4. ఉదయకుమార్ కేసు (2005) – పోలీసులకు ఉరిశిక్ష
కేరళలో దొంగతనం చేశాడన్న అనుమానంతో ఉదయకుమార్ (Udayakumar) అనే యువకుడిని పోలీసులు తీవ్రంగా హింసించి చంపేశారు. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, సీబీఐ(CBI) ప్రత్యేక కోర్టు ఇద్దరు పోలీసు అధికారులను దోషులుగా తేల్చి ఉరిశిక్ష విధించింది. కస్టోడియల్ డెత్ (Custodial Death) కేసులో పోలీసులకు అత్యంత కఠిన శిక్ష పడిన అరుదైన కేసు ఇది.

5. తమిళనాడులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
దేశాన్ని కుదిపేసిన సాత్తాన్‌కులం జయరాజ్ (Sathankulam Jayaraj), బెన్నిక్స్ కేసు (Bennix Case). కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తమిళనాడులోని సాత్తాన్‌కులంలో షాప్ తెరిచి ఉంచారనే చిన్న కారణంతో పి. జయరాజ్(P. Jayaraj), అతని కుమారుడు జె. బెన్నిక్స్‌లను (J. Bennix) పోలీసులు స్టేషన్‌కు తరలించి అమానుషంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపేశారు. ఈ దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో కేసు సీబీఐకి వెళ్లింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మహిళా కానిస్టేబుల్ ఒంటరిగా న్యాయం కోసం బాధితుల తరఫున పోరాడింది.
ఆరు సంవత్సరాల ట్రయల్ తరువాత 2026లో కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ కేసును “Rarest of Rare” గా అభివర్ణిస్తూ మదురై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాధ్యులైన 9 మంది పోలీసు అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కస్టోడియల్ హింసకు పాల్పడితే చట్టం ఎంత క్రూరంగా శిక్షిస్తుందో చెప్పడానికి ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచింది.

6. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాజా హెచ్చరిక
ఇటీవల ఒక కస్టోడియల్ డెత్ కేసు విచారణలో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) హైకోర్టు (High Court) సైతం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తి భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొంటూ బాధిత కుటుంబానికి భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

7. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు
ఏపీ(Andhra Pradesh) గాదె సాయికృష్ణ (Gade Saikrishna) ఉదంతం వెలుగుచూసిన అనంతరం మధ్యప్రదేశ్‌లో ఓ కేసు విచారణలో ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల అధికారిక విధి కాదని, అలా కస్టోడియల్ చార్చర్ చేసి నిందితులుగా మారిన పోలీసులను శిక్షించడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. సభ్య సమాజంలో కస్టడీ మరణం ఘోరమైన నేరమని అభివర్ణించింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రికార్డులు ఫోర్జరీ చేయడం పోలీసుల విధి నిర్వహణ కిందకు రావని, పోలీసుల పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ గజేంద్రసింగ్ తీర్పు ఇచ్చింది.

- కోర్టులు పదే పదే చెప్తున్న సూచనలివే..
- థర్డ్ డిగ్రీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
- విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టే హక్కు పోలీసులకు లేదు.
- కస్టడీలో మరణం సంభవిస్తే నిష్పాక్షిక విచారణ జరగాలి.
- తప్పు చేసిన ఖాకీలపై సాధారణ నేరస్థుల కంటే కఠినంగా చట్టాన్ని ప్రయోగించాలి.
విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ కేసులో కూడా పోలీసులు చట్టానికి లోబడి వ్యవహరించారా లేదా అన్నది తేలాల్సి ఉంది. కానీ, దేశవ్యాప్తంగా వస్తున్న కోర్టు తీర్పులను గమనిస్తే.. కస్టడీ హింసపై న్యాయవ్యవస్థ ఎంత కఠినంగా ఉందో స్పష్టమవుతోంది.








