యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ (Prashna Ravan) వ్యవహారంలో చట్టం ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) మాత్రం కక్షసాధింపు ధోరణి వీడటం లేదు. వరుసగా అక్రమ కేసులు బనాయిస్తూ, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా లెక్కచేయకుండా అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రావణ్‌పై పెడుతుంది తప్పుడు కేసులు.. అరెస్ట్ చేయకూడదని కోర్టులు చెబుతున్నా వినిపించుకోకుండా ఏంటీ కక్షసాధింపు అంటూ ‘ప్రశ్న'(Prashna) మద్దతు దారులు పవన్ కళ్యాణ్‌ను నిలదీస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యల నెపంతో ఇప్పటికే మూడు కేసుల్లో కోర్టులు(Courts) బెయిల్స్(Bails) మంజూరు చేసినా, అరెస్టుల పర్వకం కొనసాగుతూనే ఉంది. తాజాగా మచిలీపట్నం మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు రావణ్‌ను హాజరుపర్చగా, గౌరవ న్యాయమూర్తి.. పోలీసుల రిమాండ్ రిపోర్టును తోసిపుచ్చారు. రావణ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు. పిఠాపురం, కాకినాడ సర్పవరం కేసుల తర్వాత.. ఇలా వరుసగా మూడు సార్లు కోర్టులు పోలీసుల రిమాండ్ అభ్యర్థనలను తిరస్కరించడం గమనార్హం.
బెయిల్ రాగానే రీ-అరెస్ట్..
కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు రాగానే, ముందే ప్లాన్ చేసుకున్నట్లు మరో పోలీస్ స్టేషన్ పోలీసులు రెడీగా ఉంటున్నారు. మచిలీపట్నం కోర్టు వద్దే అప్పటికే కాపుగాసిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు రావణ్‌ను మరో కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి హుటాహుటిన అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒక కేసులో బెయిల్ రావడం.. వెంటనే గేటు బయటే మరో కేసు పేరుతో రీ-అరెస్ట్(Re-Arrest) చేయడం చూస్తుంటే.. రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని స్పష్టంగా అర్థం అవుతుందంటున్నారు ప్రజలు.
నక్కపల్లి పోలీస్ స్టేషన్‌కు రావణ్‌ను తీసుకువచ్చిన క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితుడికి రక్షణ కల్పించాల్సిన పోలీసుల ముందే జనసేన కార్యకర్తలు, నేతలు అత్యుత్సాహం కనబరిచారు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి, రావణ్‌ను తమకు అప్పగించాలంటూ భారీగా నినాదాలు చేశారు.
అంతేకాకుండా, రావణ్‌పై దాడి చేసేందుకు కోడిగుడ్లతో సిద్ధమై వచ్చారు. “కుత్తుక కోసేస్తాం.. నాలుక కోస్తాం” అంటూ పోలీసుల సమక్షంలోనే బహిరంగంగా వార్నింగ్‌లు ఇచ్చారు. ఇంత జరుగుతున్నా ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలతో పోలీసులు నవ్వుతూ ముచ్చటించడం తీవ్ర కలకలం రేపుతోంది.
న్యాయస్థానాలు వరుసగా అక్రమ అరెస్టులను తప్పుబడుతున్నా, అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ఒకరి వెనుక ఒకరు వరుస కేసులు పెడుతూ వేధించడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్ల సాక్షిగా నిందితుడిపై భౌతిక దాడులకు, ప్రాణ హెచ్చరికలకు దిగుతున్నా చర్యలు తీసుకోకపోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనంగా నిలుస్తోందని దళిత, బహుజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుత్తుక కోసేస్తాం.. నాలుక కోస్తాం.. పోలీసుల ముందే జనసైనికుల వార్నింగ్‌లు
— Telugu Feed (@Telugufeedsite) July 4, 2026
అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రశ్న రావణ్.
నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర జనసేన కార్యకర్తలు అత్యుత్సాహం
రావణ్‌ను తమకు అప్పగించాలని, కుత్తుక కోసేస్తాం.. నాలుక కోస్తాం అంటూ… https://t.co/zpw0gyd8xL pic.twitter.com/e0obqXZgKn








