చంద్ర‌బాబు విదేశీ టూర్ ‘మ‌రీ అంత ర‌హ‌స్య‌మా’..?

చంద్ర‌బాబు విదేశీ టూర్ 'మ‌రీ అంత ర‌హ‌స్య‌మా'..?

Summarize with AI

గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విదేశీ పర్యటనకు (Foreign Tour) వెళ్తున్నారంటే చాలు.. “రాష్ట్రానికి పెట్టుబడుల వరద, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ, ఒప్పందాల పర్వం” అంటూ టీడీపీ (TDP) అనుకూల మీడియా హోరెత్తించేది. పర్యటనకు సంబంధించిన ప్రతి నిమిషం షెడ్యూల్, అధికారిక ప్రతినిధుల బృందం వివరాలు మీడియాలో ప్రముఖంగా కనిపించేవి.

కానీ, తాజాగా సీఎం చంద్రబాబు చేపట్టిన విదేశీ పర్యటనపై అటు అధికార పార్టీలో గానీ, ఇటు అనుకూల మీడియా వేదికల్లో గానీ ఎలాంటి చడీచప్పుడు లేకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను ఇంత సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ తెలుగుదేశం పార్టీలోనూ (Telugu Desam Party) తీవ్రస్థాయిలో జరుగుతోంది.

ఏ దేశం వెళ్లారో బ‌య‌ట‌పెట్టిన వైసీపీ..
విపక్ష వైసీపీ(YSRCP) చంద్ర‌బాబు ‘రహస్య’ పర్యటనపై (Secret Tour) వరుస ప్రశ్నలు గుప్పిస్తూ, తెలుగుదేశం పార్టీని నిలదీస్తోంది. టీడీపీని ప్ర‌శ్నిస్తున్నా.. అక్క‌డి నుంచి స‌మాధానం లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఎలాంటి వివ‌రాల‌కు బ‌య‌ట‌పెట్ట‌కుండా వియ‌త్నాం దేశం వెళ్లార‌నే వివ‌రాల‌ను వైసీపీ బ‌య‌ట‌పెట్టడం విశేషం. చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి వైసీపీకి తెలిసిన వివ‌రాలు కూడా త‌మ‌కు తెలియ‌లేద‌ని టీడీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నారు. సీక్రెట్ టూర్‌పై విపక్షం ఎన్ని ప్రశ్నలు వేస్తున్నా, అధికార పార్టీ నుంచి గానీ, ప్రభుత్వ వర్గాల నుంచి గానీ ఎలాంటి స్పష్టత రాకపోవడం పౌరుల‌ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

వియత్నాం పర్యటన వెనుక అసలు కథేంటి..?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి, మనవడితో పాటు ఒక వైద్యాధికారి మాత్రమే ఈ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులెవ్వరూ లేకుండా కేవలం కుటుంబ సభ్యులు, ఒక వైద్యాధికారి మాత్రమే వెళ్లడం వెనుక రహస్యమేంటనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. కానీ, చంద్ర‌బాబు వియ‌త్నాం దేశాన్నే ఎందుకు ఎంచుకున్నారు.. అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్రజాస్వామ్యంలో(Democracy) ఒక ముఖ్యమంత్రి పర్యటనపై ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై (Government) ఉంది. కానీ, దేనికీ సమాధానం చెప్పకుండా, వైద్యాధికారితో కలిసి మూడు రోజుల పాటు సాగించిన ఈ ‘వియత్నాం సీక్రెట్ టూర్’ (Vietnam Secret Tour) వెనుక ఉన్న అసలు నిజాలేంటో ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment