భారత పతకాల సంఖ్య 50కి చేరువ.. ఏషియన్‌ గేమ్స్‌లో కొనసాగుతున్న జోరు

భారత పతకాల సంఖ్య 50కి చేరువ.. ఏషియన్‌ గేమ్స్‌లో కొనసాగుతున్న జోరు

Summarize with AI

ఏషియన్‌ గేమ్స్‌(Asian Games) 2026లో భారత్‌(India) పతకాల వేట కొనసాగుతోంది. 10వ రోజు భారత్‌ మహిళల టీమ్‌ ట్రాప్‌ షూటింగ్‌లో(Women’s Team Trap Shooting) రజత పతకంతో(Silver Medal) ఖాతా తెరిచింది. దీంతో భారత్‌ 50 పతకాల (46) మార్క్‌కు మరింత చేరువైంది. నీరూ ధండా(Neeru Dhanda), అషిమా అహ్లావత్‌(Ashima Ahlawat), మనీష కీర్‌ (Manisha Keer) సభ్యులుగా ఉన్న భారత జట్టు 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో నీరూ ధండా వ్యక్తిగత పోటీలో 118 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఆర్చరీలోనూ (Archery)భారత క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో ధీరజ్‌ బొమ్మదేవర ఫిలిప్పీన్స్‌కు చెందిన గిర్విన్‌ గార్సియాను 6-0తో, చైనీస్‌ తైపీకి చెందిన చెంగ్‌ హ్సియాంగ్‌-హుయ్‌ను 6-2తో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. మరో భారత ఆర్చర్‌ నీరజ్‌ చౌహాన్‌(Neeraj Chauhan)దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ జె-డియోక్‌పై 6-4తో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాడు.

స్క్వాష్‌లో భారత మహిళల జట్టు ఇరాన్‌పై(Iran) 2-0తో విజయం సాధించింది. మరోవైపు బాక్సింగ్‌(Boxing), అథ్లెటిక్స్‌లోనూ(Athletics) భారత్‌ పతకాలపై ఆశలు పెట్టుకుంది. బాక్సింగ్‌లో పర్వీన్‌(Parveen), అంకుష్‌ పాంగల్‌(Ankush Panghal), నరేందర్‌ (Narender) సెమీఫైనల్స్‌లో బరిలోకి దిగనుండగా.. అథ్లెటిక్స్‌లో గుల్వీర్‌ సింగ్‌, అవినాశ్‌ సేబుల్‌, గురిందర్‌వీర్‌ సింగ్‌, అనిమేశ్‌ కుజూర్‌ తదితరులు పతకాల కోసం పోటీ పడనున్నారు. ట్రాక్‌ సైక్లింగ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment