వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), టీడీపీ ప్రభుత్వం (TDP Government) తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ఆత్మరక్షణలో పడినప్పుడల్లా వాడుకుంటున్నారనే ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో(AP Politics) తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంపై ఏ చిన్న ప్రజా వ్యతిరేకత వచ్చినా, సంక్షోభం ఎదురైనా.. వెంటనే వివేకా ఈ కేసును(Viveka Murder Case), లేని లిక్కర్ కేసును (Liquor Case) తెరపైకి తెచ్చి మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం నడిపించడం పరిపాటిగా మారిందని రాజకీయ విశ్లేషకులు, వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీం కోర్టు (Supreme Court) పలుమార్లు అభ్యంతరాలు చెప్పినా, చీవాట్లు పెట్టినా వాటిని పెడచెవిన పెడుతూ.. ఈ కేసు ఎప్పటికీ తేలకుండా, కేవలం విపక్షంపై బురద చల్లడానికి మాత్రమే ఉపయోగపడాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని వాదనలు చర్చనీయాంశంగా మారాయి.
ఒప్పుకున్న నేరస్థులకు బెయిళ్లు, గన్‌మెన్ల ప్రొటెక్షన్!
వివేకానందరెడ్డిని తానే స్వయంగా గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన అప్రూవర్ దస్తగిరికి (Dastagiri) టీడీపీ ప్రభుత్వం ఇద్దరు గన్‌మెన్లతో(Gunmen) ప్రత్యేక రక్షణ కల్పించి బయట దర్జాగా తిప్పుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. నేరుగా నేరం ఒప్పుకున్న వ్యక్తి టీడీపీ కేంద్ర కార్యాలయానికి(TDP Central Office) వెళ్లి చంద్రబాబును కలవడం, అలాంటి నేరస్థులకు బెయిళ్లు (Bails) ఎవరు ఇప్పించారనేది సమగ్రంగా పరిశీలిస్తే దీని వెనుక ఉన్న అసలు రాజకీయ హస్తం ఎవరిదో స్పష్టమవుతుందని గుర్తుచేస్తున్నారు.
మరో నిందితుడు సునీల్ యాదవ్‌తో(Sunil Yadav) టీడీపీ అనుకూల ఛానెల్స్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇప్పించడం, వాటి ఆధారంగా అనుకూల పత్రికల్లో కథనాలు రాయించి, మరుసటి రోజే ఒక అధికార పార్టీ మంత్రితో ప్రెస్ మీట్ పెట్టించడం.. ఇదంతా ముందస్తుగా రచించిన కట్టుకథేనని ప్రజలకు అర్థమైపోయిందని విశ్లేషిస్తున్నారు. చంపినోళ్లే బయటకు వచ్చి వివేకానందరెడ్డిపై తమకు ప్రేమ ఉందని పదే పదే చెప్పుకోవడం, వాటిని మీడియా ఆసక్తికర వ్యాఖ్యలుగా ప్రచారాలు చేయడం, వాటిని ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి మంత్రి స్థాయి వ్యక్తులు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రతిపక్షంపై ఆరోపనలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని స్పష్టమవుతోంది.
సునీత రాజకీయం.. లోకేష్‌తో భేటీ?
న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పే వివేకా కుమార్తె సునీత (Sunitha) వైఖరి కూడా అనేక అనుమానాలకు తావిస్తోందంటున్నారు. తన తండ్రి వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో ఎంపీ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) గెలుపు కోసం స్వయంగా పనిచేశారని, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నాడని ఆమె, మీడియాకు వివరించిన విషయం తెలిసిందే.. తర్వాత మాట మార్చడం వెనుక చంద్రబాబు డైరెక్షన్ (Chandrababu Direction) ఉందనే వార్తలు గతం నుంచే ఉన్నాయి.
ఇటీవల సునీత నారా లోకేష్‌ను(Nara Lokesh) కలిశారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) టీడీపీ తరఫున ఆమెకు జెడ్పీటీసీ(ZPTC) పదవి ఇవ్వజూపారని వార్తలు లీక్ అయ్యాయి. ఈ లీకులు బయటకు వచ్చి వారం రోజులు దాటుతున్నా ఇటు సునీత వర్గం గానీ, అటు టీడీపీ గానీ ఖండించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ప్రజల దృష్టి మళ్లించేందుకే మళ్లీ డ్రామాలా..?
ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులు(DSC Candidates), సచివాలయ ఉద్యోగులు(Secretariat Employees), కానిస్టేబుల్ అభ్యర్థులు (Constable Candidates) తమ సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. అటు దేశంలో సీఈసీ వివాదం (CEC Controversy) ముదురుతున్న సమయంలో సీఎం చంద్రబాబు ఎలాంటి వివరాలు వెల్లడించకుండా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. వరుస నిరసనలతో ప్రభుత్వం తీవ్ర ఆత్మరక్షణలో పడిపోవడంతో, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి పక్కకు మళ్లించేందుకే మళ్లీ వివేకా కేసు డ్రామాను తెరపైకి తెచ్చారని విశ్లేషిస్తున్నారు.
నేరస్థులను కాపాడుతూ, తమ చెప్పుచేతల్లో ఉన్న మీడియాను వాడుకుని విపక్ష నేత వైఎస్ జగన్‌పై(YS Jagan), వైసీపీపై దుష్ప్రచారం చేయిస్తున్న చంద్రబాబు నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ఈ దిగజారుడు రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








