ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మాడుగుల నియోజకవర్గం (Madugula Constituency) ఏ.కోడూరులో(A.Koduru) పర్యటన సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. సీఎం సభ (CM Meeting) జరుగుతున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు (Sanitation Worker) దడాల వీరబాబు (Dadala Veerababu) మృతి చెందారు. పాయకరావుపేట నుంచి విధుల నిర్వహణ కోసం వచ్చిన వీరబాబు సభా ప్రాంగణంలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
అయితే వీరబాబు మృతి విషయాన్ని సీఎం పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు(Officials) గోప్యంగా (Kept Secret) ఉంచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన అనంతరం వీరబాబు మృతదేహాన్ని(Dead Body) కే.కోటపాడు ఆస్పత్రికి (K.Kotapadu Hospital) తరలించినట్లు తెలుస్తోంది.
వీరబాబు మృతదేహానికి హడావుడిగా పోస్టుమార్టం (Postmortem) నిర్వహించి, అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సీఐటీయూ నేతలు (CITU Leaders) ఆరోపిస్తున్నారు. సభలో విధులు నిర్వహిస్తూ కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వీరబాబు మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని, విధుల్లో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. వీరబాబు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం (Government Job) ఇవ్వడంతో పాటు రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని కోరింది.
వీరబాబు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ నేత వీవీ శ్రీనివాసరావు (CITU Leader V.V. Srinivasa Rao) స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఎం సభలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.








