సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

Summarize with AI

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత సాహో(28) యూనివర్సిటీలో గెస్ట్ లెక్చ‌ర‌ర్‌గా విధులు నిర్వహిస్తుంది. అద్దెకు ఉంటున్న‌ తన నివాసంలో శనివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆత్మహత్యకు గల కారణం ఏమిటి?
యోజిత సాహో ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలేనా? లేక వృత్తిపరమైన ఒత్తిడిలా? అనేక అనుమానాల మధ్య దర్యాప్తు ముమ్మరం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment