‘సంపద నిల్‌.. అప్పులు ఫుల్‌’.. – కూటమిపై బుగ్గన సెటైర్లు

'సంపద నిల్‌.. అప్పులు ఫుల్‌'.. - కూటమిపై బుగ్గన సెటైర్లు

Summarize with AI

వైసీపీ నేత‌, ఏపీ మాజీ ఫైనాన్స్ మినిస్ట‌ర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) మరోసారి కూటమి ప్రభుత్వం (Coalition Government)పై సెటైర్లు వేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సంప‌ద సృష్టిస్తా.. పేద‌లంద‌రికీ పంచుతాన‌ని ప్ర‌క‌టించుకున్న చంద్ర‌బాబు.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సృష్టించిన సంప‌ద కంటే.. చేసిన అప్పులే ఎక్కువ అంటూ పంచ్‌లు వేశారు. 10 నెల‌ల కాలంలో ఏ రంగంలో ఎంతెంత సంప‌ద సృష్టించారో చెప్ప‌గ‌ల‌రా..? మీరు ఏయే నెల‌లో ఎంతెంత అప్పు చేశారో లెక్క‌ల‌తో స‌హా చెబుతాన‌ని బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స‌వాల్ చేశారు.

ఎక్కడినుంచి ఎక్కడికొచ్చాం?
“కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కేంద్రంలో మద్దతు ఉందని చెప్పుకుంటున్నారు కానీ ఆ మద్దతు ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడుతోంది? ఎవరి న‌చ్చిన‌ట్లుగా వారు చెప్పుకుంటున్నారు. కేంద్రం నుంచి తెచ్చేందంతా అప్పు లెక్కలుగా చెబుతున్నారు.

సంపద లేదు.. అప్పులు మాత్రమే?
మీరు సంపద సృష్టించారంటున్నారు.. కానీ మేం వదిలినప్పటికి రూ.81,400 కోట్ల పన్ను ఆదాయం (Tax Revenue) ఉన్నా, ఇప్పుడున్న ఆదాయం అది మించి లేదు. పైగా, మా పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వం 7.5 శాతం తక్కువ సంపద సృష్టించింది” అని ఆయన వివరించారు.

ప్రజల కోసం పాలించాం.. మీరు?
వైసీపీ పాలనలో సామాన్యుడి భద్రతకు, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు మీరు అప్పు ఎక్కువ చేసి దానిని ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? జగన్ అమ‌లు చేసిన‌ పథకాలు (Jagananna Schemes) పోయాయి.. మీరు చెప్పినవైతే రాలేదు. సంపద అంతా ఎక్కడికి పోతుంది? వైసీపీ అప్పులు చేసింది అంటున్నారు.. కానీ మీరు మమ్మల్నికంటే ఎక్కువ అప్పులు చేసి కూడా ప్రజలకు ఏమి ఇవ్వలేకపోతున్నారు. ఇది వాస్తవమా లేక మాయా?” అని బుగ్గన ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment