పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం

పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం

Summarize with AI

పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌ రెండో రోజు పర్యటన కొన‌సాగుతోంది. పులివెందుల‌లో రాజారెడ్డి ఐ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాట్లు, సేవలను పరిశీలించిన జగన్, అక్క‌డే కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.

రాజారెడ్డి ఆసుపత్రి పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందింది. దివంగత ముఖ్య‌మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆసుపత్రిలో పని చేసి “రూపాయి వైద్యుడిగా” ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ మరియు వైఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఈ ఆసుపత్రిని ఆధునీకరించారు.

ప్రజలకు అధునాతన సేవలు
రాజారెడ్డి ఐ సెంటర్ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో, తక్కువ ఖర్చుతో అత్యుత్తమ కంటి వైద్య సేవలను అందించనుంది. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో మెరుగైన సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రి నూతన రూపంలో అందుబాటులోకి వచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment