ఆసియా క్రీడలు-2026లో (Asian Games-2026)భారత పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్టు(Indian Men’s Compound Archery Team) స్వర్ణ పతకం(Gold Medal) సాధించింది. జపాన్‌లోని ఐచి-నగోయా(Aichi-Nagoya, Japan) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా జరిగిన ఫైనల్లో గణేష్ మణి రత్నం తిరుమురు(Ganesh Mani Ratnam Tirumuru), సాహిల్ జాదవ్(Sahil Jadhav), కుశాల్ దలాల్‌తో(Kushal Dalal) కూడిన భారత జట్టు చైనాపై(China) 238–237తో ఉత్కంఠభరిత విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 236–229తో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో చైనాను మట్టికరిపించిన భారత జట్టు స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) చెందిన గణేష్ మణి రత్నం తిరుమురు నాయుడుపేట నుంచి క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత జట్టు స్వర్ణ విజయంలో కీలకంగా నిలిచిన సాహిల్ రాజేష్ జాదవ్ మహారాష్ట్రలోని(Maharashtra) సతారాకు చెందిన కాంపౌండ్ ఆర్చర్. 2001 ఏప్రిల్ 11న జన్మించిన సాహిల్ దృష్టి ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందుతూ క్రమంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 2025 వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో వ్యక్తిగత స్వర్ణం, టీమ్ రజతం సాధించిన ఆయన, 2026 ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో వ్యక్తిగత కాంస్య పతకం సాధించారు. ఆసియా క్రీడల్లో గణేష్, కుశాల్‌తో కలిసి చైనాపై స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.








