ఓటర్ల నమోదు (Voter Registration) ప్రక్రియలో తీవ్ర వివాదస్పదమైన అదనపు ఎస్ఐఆర్ (SIR) డిక్లరేషన్‌పై (Declaration) కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక అడుగు వెనక్కి తగ్గింది. నూతన ఓటర్ల నమోదు (New Voter Registration) కోసం ఉపయోగించే ఫారం-6లో(Form-6) చేసిన మార్పులను చట్టవిరుద్ధమని కమిషన్‌లోని ఇద్దరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో, ఆ మార్పులను ఈసీ(EC) ఉపసంహరించుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇకపై పాత ఫారం-6నే పునరుద్ధరించాలని నిర్ణయించింది.
ఏమిటీ వివాదాస్పద ఎస్ఐఆర్ డిక్లరేషన్..?
ఇంతకుముందు అమల్లోకి తెచ్చిన నిబంధనల ప్రకారం.. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఫారం-6తో పాటు ఒక అదనపు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉండేది. అందులో దరఖాస్తుదారులు లేదా వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గతంలో నిర్వహించిన ‘ప్రత్యేక తీవ్రమైన పరిశీలన’ (Special Intensive Revision – SIR) ఓటర్ల జాబితాలో ఉన్నట్లు ఆధారాలు, వివరాలు వెల్లడించాల్సి రావడంతో సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మార్పులను పార్లమెంట్ చట్టబద్ధమైన సవరణలు లేకుండా చేయడంపై కమిషన్‌లోనే తీవ్ర అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యాయి.
- కీలక నిర్ణయాలు
- సెప్టెంబర్ 26న ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar), ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు(Sukhbir Singh Sandhu), వివేక్ జోషిల (Vivek Joshi) నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని అమలులోకి తెచ్చారు.
- ఇప్పటికే ఎస్ఐఆర్ ముగిసిన రాష్ట్రాల్లో కొత్తగా ఓటు నమోదు చేసుకునే దరఖాస్తుదారులు పాత పద్ధతిలోనే సాధారణ ఫారం-6ను సమర్పిస్తే సరిపోతుంది.
- ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న కొన్ని నిర్దిష్ట రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ అదనపు డిక్లరేషన్ నిబంధన ప్రస్తుతానికి అమలులో ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం (Central Government) చట్టబద్ధంగా నిబంధనల సవరణ (Registration of Electors Rules, 1960) చేయకుండా ఫారమ్‌లను మార్చడం చట్టవిరుద్ధమని కమిషనర్లు స్పష్టం చేయడంతో, ఈసీ తన నిర్ణయాన్ని సరిదిద్దుకుంటూ పాత పద్ధతినే పునరుద్ధరించడం గమనార్హం.








