పిఠాపురంలో వైసీపీ ఘన విజయం.. ఎన్నిక రద్దు చేయించిన జనసేన

పిఠాపురంలో వైసీపీ ఘన విజయం.. ఎన్నిక రద్దు చేయించిన జనసేన

Summarize with AI

కాకినాడ జిల్లా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ జెండా ఎగిరింది. నియోజకవర్గ పరిధిలోని పాఠశాల కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అయితే, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వైసీపీ గెలవడాన్ని జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు పాఠశాల కమిటీ ఎన్నికల్లోనూ రాజకీయాలు జొప్పించి, పరాజయాన్ని తట్టుకోలేక అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ఫలితాలను రద్దు చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొడవలిలో వరుసగా రెండోసారి
పిఠాపురం నియోజకవర్గం కొడవలి గ్రామంలోని పాఠశాల కమిటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు వరుసగా రెండోసారి చైర్మన్‌గా ఘన విజయం సాధించారు. అలాగే చెందుర్తి పరిధిలోని మూడు పాఠశాలల్లో రెండింటికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ మద్దతు తెలిపిన చైర్మన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఎంపీపీ యుపి పాఠశాల కమిటీకి జరిగిన హోరాహోరీ పోరులో జనసేన చైర్మన్ అభ్యర్థి నూకరాజుపై వైసీపీ అభ్యర్థి శివ నాగేశ్వరరావు ప్రస్పష్టమైన మెజార్టీతో విజయం సాధించారు.

అధికారులపై ఎంపీ, జనసేన నేతల ఒత్తిళ్లు!
డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో, అందునా పాఠశాల స్థాయి ఎన్నికల్లో కూడా ఓటమి ఎదురవ్వడాన్ని జనసేన నేతలు తట్టుకోలేకపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించడాన్ని అడ్డుకునేందుకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు రంగంలోకి దిగారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి, నిబంధనలకు విరుద్ధంగా గెలిచిన ఎన్నికలను రద్దు చేయించారని మండిపడుతున్నారు.

చిన్నపిల్లలు చదువుకునే పాఠశాలల కమిటీ ఎన్నికల్లో కూడా ఈ రకమైన దిగజారుడు రాజకీయాలు చేయడం జనసేన నాయకుల అహంకారానికి, ఓటమి భయానికి నిదర్శనమని స్థానికులు, వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై వేలం వేస్తూ అధికారులను బెదిరించి ఫలితాలను రద్దు చేయించడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment