గవర్నర్ గడప తొక్కిన డీఎస్సీ స్కామ్‌.. కోర్టులో లాయ‌ర్‌లా వివరించిన జ‌గ‌న్

గవర్నర్ గడప తొక్కిన డీఎస్సీ స్కామ్‌.. కోర్టులో లాయ‌ర్‌లా వివరించిన జ‌గ‌న్

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో చంద్ర‌బాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్ర అవకతవకలు, అక్రమాలు ఏపీ లోక్‌భ‌వ‌న్‌కు చేరాయి. వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం విజయవాడలోని లోక్‌ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సమావేశమైంది. డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలు, నిరసన తెలిపిన వారిపై సాగుతున్న వేధింపులకు సంబంధించిన పూర్తి ఆధారాల కాపీలను గవర్నర్‌కు నేరుగా అందజేశారు.

కోర్టు వాదనలా పిన్ టూ పిన్ వివరణ
దాదాపు అర గంటపాటు సాగిన ఈ భేటీలో వైఎస్ జగన్ ఒక సమర్థవంతమైన న్యాయవాది తరహాలో కేసుకు సంబంధించిన ప్రతీ అంశాన్ని గవర్నర్‌కు వివరించారు. డీఎస్సీ అక్ర‌మాల‌పై బ‌య‌ట‌ప‌డిన ఆధారాల‌ను తన వెంట తీసుకెళ్లిన జ‌గ‌న్‌.. గవర్నర్‌కు ఒక కాపీని అందజేసి, ఒక్కో అంశాన్ని పేజీల వారీగా ఆధారాలను కులంక‌షంగా వివ‌రించార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

  • యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి దొడ్డిదారిన ఉద్యోగాలు కల్పించేందుకు నిబంధనలను ఉల్లంఘించార‌ని, జీవోల పేరుతో నిజ‌మైన అభ్య‌ర్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడార‌ని జ‌గ‌న్ వివ‌రించారు.
  • అర్హత లేని వారికి తప్పుడు పత్రాలు సృష్టించి, స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారని ఆధారాలతో ప్రదర్శించారు.
  • ప్రభుత్వం తన అధికారాలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ పారదర్శకతను నీరుగార్చిందని గ‌వ‌ర్న‌ర్‌కు ఆధారాల‌తో మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స్పష్టంగా తెలియ‌జేశారు.
  • డీఎస్సీ స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్ కేటగిరీలు, సర్టిఫికెట్ల పరిశీలన వంటి అంశాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ సీబీఐతో విచార‌ణ చేయించాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు.
    వైఎస్ జగన్ ఈ అంశాలను పిన్ టూ పిన్ ఆధారాలతో నిరూపించిన తీరు పట్ల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ డీఎస్సీ స్కామ్‌పై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశార‌ని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

అప్రజాస్వామిక అణచివేత.. రౌడీ షీట్లపై తీవ్ర నిరసన
డీఎస్సీ అక్రమాలపై శాప్ (SAAP) కార్యాల‌యం ఎదుట‌ శాంతియుతంగా నిరసన తెలియజేసిన యువత, వైసీపీ నాయకులపై దాడి, చంద్ర‌బాబు ప్రభుత్వం సాగిస్తున్న అప్రజాస్వామిక చర్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ జ‌గ‌న్‌. రాజ్యాంగబద్ధంగా లభించిన నిరసన హక్కును కాలరాస్తూ అక్రమ అరెస్టులు చేయడం, డీఎస్సీ అక్ర‌మాల‌ను నీరుగార్చేందుకు రౌడీ షీట్లు పేరుతో బెదిరింపుల‌కు దిగ‌డం వంటి అరాచకాలను గవర్నర్‌కు వివరించారు.

డీఎస్సీ వివాదం, ప్రతిపక్ష నాయ‌కులు, కార్యకర్తలపై కేసులు, అరెస్టులు, రౌడీషీట్ల వ్యవహారాన్ని కలిపి చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డింద‌ని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌కు తెలియ‌జేశారు. రాష్ట్రంలో కొన‌సాగుతున్న అనాగ‌రిక ప‌రిస్థితుల‌పై, డీఎస్సీ అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిగేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరిన‌ట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment