మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్‌ మాటలకు భావోద్వేగం

మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్‌ మాటలకు భావోద్వేగం

Summarize with AI

వైసీపీ(YSRCP) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మరోసారి భావోద్వేగానికి(Emotional) లోనై కంటతడి పెట్టుకున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా(Vizianagaram District)విస్తృత స్థాయి స‌మావేశంలో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తన రాజకీయ ప్రయాణంలో బొత్స సత్యనారాయణ అందించిన సహకారం, ప్రోత్సాహాన్ని గుర్తుచేశారు. అమర్‌నాథ్ మాట్లాడుతున్న సమయంలో బొత్స తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గంలో (Cheepurupalli Constituency) జరిగిన నాయకులు, కార్యకర్తల సమావేశంలోనూ బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. పార్టీకి సంబంధించిన పరిణామాలపై కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతున్న సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను నమ్మినవారే మోసం (Betrayal) చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బొత్స.. పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అప్పట్లో సూచించారు.

వ్యక్తులు రాజకీయాల్లోకి(Politics) రావచ్చు, వెళ్లిపోవచ్చని, కానీ పార్టీ (Party) మాత్రం శాశ్వతంగా (Forever) ఉంటుందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. ఇటీవల బొత్స సత్యనారాయణ త‌ర‌చుగా భావోద్వేగానికి గురవుతున్న ఘటనలు వైసీపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment