బీజేపీ జాతీయ కొత్త టీమ్‌.. ఏపీకి మూడు పదవులు

బీజేపీ జాతీయ కొత్త టీమ్‌.. ఏపీకి మూడు పదవులు

Summarize with AI

భారతీయ జనతా పార్టీ(BJP)జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ (Nitin Nabin) కొత్త జాతీయ పదాధికారుల బృందాన్ని(National Office Bearers Team) ప్రకటించారు. పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రకటించిన ఈ కొత్త టీమ్‌లో వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించారు. తాజా మార్పుల్లో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులకు చోటు కల్పించారు.

కొత్త జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో రామ్‌ మాధవ్‌(Ram Madhav), దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) సహా 13 మంది ఉన్నారు. ఏపీ నుంచి పురందేశ్వరికి జాతీయ స్థాయిలో బాధ్యత దక్కింది. తెలంగాణకు కొత్త జాతీయ పదాధికారుల బృందంలో చోటు దక్కలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ నుంచి ముగ్గురికి జాతీయ స్థాయిలో చోటు లభించింది.

బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్‌ సంతోష్‌ (BL Santosh) కొనసాగనున్నారు. పార్టీ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) కూడా తన బాధ్యతల్లో కొనసాగనున్నారు. సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివ ప్రకాశ్‌(Shiv Prakash), సౌధాన్‌ సింగ్‌ (Saudhan Singh) కొనసాగనున్నారు.

జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సునీల్‌ బన్సల్‌, వినోద్‌ తావడే, విప్లవ్‌ కుమార్‌ దేవ్‌, స్మృతి ఇరానీ, సతీష్‌ పునియా, గజేంద్ర పటేల్‌, హరీష్‌ ద్వివేది, సంజయ్‌ భాటియాలకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌గా దీపక్‌, మీడియా కన్వీనర్‌గా అనిల్‌ బలోని నియమితులయ్యారు. బీజేపీ(BJP) సెల్స్‌ జాయింట్‌ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌ రెడ్డికి(Vishnuvardhan Reddy) బాధ్యతలు దక్కాయి.

బీజేపీ వివిధ మోర్చాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించింది. యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్‌ హేమంగు జోషి, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్‌ కుమారి చౌదరి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమరుపాల్‌ మౌర్య, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడిగా బన్సీలాల్‌ గుజర్‌ నియమితులయ్యారు. ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివేష్‌ కుమార్‌ రామ్‌, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా మన్నన్లాల్‌ రావత్‌, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా కొన్వార్‌ బాసిత్‌ అలీకి బాధ్యతలు అప్పగించారు.

నితిన్‌ నబీన్‌ నాయకత్వంలో ప్రకటించిన కొత్త జాతీయ బృందంతో పార్టీ సంస్థాగత వ్యవహారాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, రాబోయే రాజకీయ సవాళ్లకు అనుగుణంగా పార్టీని సిద్ధం చేయడంపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తాజా పునర్వ్యవస్థీకరణ సూచిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment