నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని శ్రీరాంసాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) ప్రాజెక్ట్ (SRSP Project) వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన నలుగురు యువకులు (Four Youths)ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో మృతి చెందారు. స్థానికులు వారి కేకలు విని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. మొదట ముగ్గురు మృతదేహాలను వెలికితీయగా, అనంతరం మరో వ్యక్తి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
మృతుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన కలీమ్(Kaleem), నజవత్ (Najavath), అజీమ్ (Azeem) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో మృతుడి వివరాలను నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రాజెక్టులు, జలాశయాలను సందర్శించే పర్యాటకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.









ముదురుతున్న వివాదం.. బోండా ఉమ వర్సెస్ టీడీపీ!